Naga Chaitanya: నిజమైన ప్రేమ ఎప్పటికీ బాధను కలిగిస్తుంది - నాగచైతన్య..!

Naga Chaitanya About True Love: తాజాగా నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిజమైన ప్రేమ ఎప్పటికీ బాధను కలిగిస్తుంది అంటూ తెలిపారు. గతంలో నాగచైతన్య.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది సంవత్సరాల తర్వాత ఇప్పుడు శోభితాని రెండో పెళ్లి చేసుకున్నారు.

1 /5

అక్కినేని హీరోగా పేరు సొంతం చేసుకున్న నాగచైతన్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.  తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు కానీ ఒక కమర్షియల్ హిట్ కూడా ఆయన ఖాతాలో పడకపోవడం ఆశ్చర్యం అనే చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించారు. కానీ ఒక్క సక్సెస్ కూడా లేకపోవడం అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పవచ్చు.

2 /5

ఇక శోభితాను వివాహం చేసుకోక ముందు వరకు వ్యక్తిగత జీవితంలో కూడా ఈయన ఫెయిల్యూర్ గానే నిలిచారు. సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ నాలుగేళ్లకే ఆమె దూరమైంది.  దీంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ అటు వ్యక్తిగతంగా ఇటు కెరియర్ పరంగా సక్సెస్ లేక ఎన్నో ఇబ్బందులు చవిచూశారు నాగచైతన్య.   

3 /5

ఇకపోతే తాను ప్రేమించిన శోభిత ధూళిపాలను పెద్దల సమక్షంలో గత ఏడాది వివాహం చేసుకున్నారు.  దీనికి తోడు ఇప్పుడు మళ్లీ సాయి పల్లవితో జతకట్టి తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగచైతన్య. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే భారీ ఇమేజ్ సొంతం చేసుకుంది.   

4 /5

అంతేకాదు నిజ జీవిత ఆధారంగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు శోభితను వివాహం చేసుకున్న తర్వాత సినిమా రాబోతుండడంతో ఆయన అదృష్టం ఎలా ఉండబోతుందని అభిమానులు సైతం చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు.   

5 /5

ఇలాంటి సమయంలో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈయన నిజమైన ప్రేమ చాలా బాధను కలిగిస్తుంది అంటూ కామెంట్లు చేశారు. ఇకపోతే నాగచైతన్య తండేల్ మూవీ గురించి మాట్లాడుతూ.. ఇది ఒక అందమైన ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే నిజమైన ప్రేమ గురించి ప్రస్తావన వస్తే, నిజమైన ప్రేమలో చాలా బాధ ఉంటుంది. మీరు ఆ బాధను అనుభవించిన తర్వాత  దాని నుండి బయటపడినప్పుడు, అది సంబంధాన్ని చాలా భిన్నమైన రీతిలో బంధిస్తుంది. కాబట్టి మీరు ఈ సినిమాలో ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తారు అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికి అయితే నాగచైతన్య ఇది తన వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాట అన్నారా?  లేక సినిమాలో కథను దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పారా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది