Papaya Facemask: బొప్పాయి ఫేస్‌మాస్క్‌తో బోలెడు ప్రయోజనాలు.. హిరోయిన్‌ మించిన అందం మీ సొంతం..

Everyday Papaya Facemask: బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉండటమే కాదు.. దీన్ని స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో కూడా విపరీతంగా ఉపయోగిస్తారు. వివిధ స్కిన్‌ కేర్‌ ఉత్పత్తుల్లో కూడా బొప్పాయి ఉపయోగిస్తారు. ఈరోజు ఇంట్లో ప్రతిరోజూ బొప్పాయి ఫేస్‌ మాస్క్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుకుందాం.
 

1 /5

బొప్పాయిని స్కిన్‌ కేర్‌ రొటిన్‌లో ఉపయోగించడం వల్ల మెరిసే అందం మీ సొంతమవుతుంది. ఇందులో ఉండే విటమిన్స్‌ మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేసి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీంతో స్కిన్‌ నిత్య యవ్వనంగ కనిపిస్తుంది.  

2 /5

ఒక టీ స్పూన్‌ తేనె, ఒక కప్పు బొప్పాయి గుజ్జు, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్ ముఖం, మెడా భాగంలో అప్లై చేసి ఓ అరగంట పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ఫేస్ వాష్‌ చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్‌ ఉపయోగించాలి.  

3 /5

బొప్పాయి గుజ్జులో రెండు టీస్పూన్ల ఆరెంజ్‌ జ్యూస్‌ అప్లై చేసి ఓ అరగంటపాటు ఆరనవ్వాలి. డ్రైస్కిన్‌ సమస్యతో బాధపడుతున్నవారు కాస్త కీరదోస రసం కూడ కలపాలి. బొప్పాయి గుజ్జు, అరటిపండు కలిపి కూడా ముఖానికి ఫేస్‌ మాస్క్‌ వేసుకోవచ్చు.  

4 /5

బొప్పాయి గుజ్జులో ఎగ్‌ వైట్‌ వేసి ముఖానికి అప్లై చేస్తే చర్మం టైట్‌గా మారుతుంది. ఈ ఫేస్‌ మాస్క్‌ను కూడా వారానికి రెండుసార్లు వాడటం వల్ల మెరుగైన ఫలితాలు కలుగుతాయి. బొప్పాయి రెండు టీస్పూన్లు, టమోటా జ్యూస్‌తో ట్యాన్‌ అయిన ప్రదేశంలో అప్లై చేయవచ్చు.  

5 /5

ఈ ఫేస్‌ మాస్క్‌ డ్రైస్కిన్‌, మంగు మచ్చలను తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. బొప్పాయి ఫేస్‌ మాస్క్‌ తరచూ ఉపయోగించడం వల్ల మీ ముఖం మెరిసిపోతుంది. డైలీ రొటీన్‌లో బొప్పాయి మాస్క్‌తో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. మీ ముఖం నేచురల్‌గా మెరిసిపోతుంది. ఏ ఫేస్‌ మాస్క్‌ ఉపయోగించినా ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మేలు.