Rahu And Ketu Transit 2025: రాహువు, కేతువు గ్రహాలు మార్చి 16న నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. దీని వల్ల ఈ కింది రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Rahu And Ketu Transit 2025 Effect On Zodiac Signs: రాహువు, కేతువు గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలను కీడు గ్రహాలుగా కూడా చెప్పుకుంటారు. జాతంలో ఈ రెండు గ్రహాలు అశుభస్థానంలో ఉంటే అనేక సమస్యలతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మార్చి 16న ఎంతో శక్తివంతమైన ఈ రాహువు, కేతు గ్రహాలు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి.
ఈ సమయంలో రాహువు పూర్వాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తే.. కేతువు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారి ఊహించని ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో రెండు గ్రహాలు జాతకంలో శుభస్థానంలో ఉన్న రాశులవారికి బంఫర్ లాభాలు కలుగుతాయి.
కేతువు, రాహువు గ్రహాల సంచారం వల్ల మకర రాశితో పాటు మీన రాశి, ఇతర కొన్ని రాశులవారికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అయితే సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కేతువు, రాహువు గ్రహాల సంచారం ఎఫెక్ట్ కారణంగా మకర రాశివారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా ఊహించని విజయాలు సాధిస్తారు.
మకర రాశివారికి ఈ సమయంలో ఎక్కువగా మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా కుటుంబంతో కూడా మంచి సమయం గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆరోగ్య కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు వీరికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి.
మీన రాశి వారికి ఈ రెండు గ్రహాలు నక్షత్ర సంచారం చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు కూడా విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.
మీన రాశివారు ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో అద్భుతమైన విజయాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి.
రాహు-కేతువుల నక్షత్ర సంచారం వల్ల మేష రాశికి ఆర్థికంగా బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయంలో కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి అనుకున్న పనుల్లో కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
ఈ రెండు గ్రహాలు నక్షత్ర సంచారం చేయడం వల్ల మిథున రాశివారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. వ్యాపారాలు చేసేవారికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.