Ration Card: కొత్త రేషన్‌ కార్డ్‌కు అప్లై చేశారా? ఆన్‌లైన్‌లో ఇలా మీ అప్లికేషన్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోండి..

Track Your Ration Card Status: తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ కార్డు లేనివారికి కొత్తగా రేషన్‌ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతో ఈసేవ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి మరీ కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, మీరు కూడా కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆన్‌లైన్‌లో ఎలా మీ అప్లికేషన్‌ స్టేటస్‌ ట్రాక్‌ చేయవచ్చు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తు మరింత సులభతరం చేసింది తెలంగాణ కాంగ్రెస్‌ సర్కార్‌. అప్లికేషన్‌ స్టేటస్‌ ఆన్‌లైన్‌లో ట్రాక్‌ చేసే సౌలభ్యం కూడా కల్పించింది. ఈ విధానం కోసం ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ను  ప్రారంభించింది. దీంతో ప్రతి ఒక్కరూ తమ రేషన్‌ కార్డు స్టేటస్ చెక్‌ చేసుకోవచ్చు.  

2 /5

తెలంగాణలో ఏ పథకం ప్రయోజనం పొందాలన్నా రేషన్‌ కార్డు ఉండాల్సిందే. అయితే, చాలా ఏళ్ల తర్వాత కొత్త రేషన్‌కార్డులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కుటుంబ సభ్యులను చేర్చే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు (FSC) పొందుతారు.  

3 /5

రేషన్‌ కార్డు స్టేటస్‌ ట్రాక్‌ చేసే విధానం.. తెలంగాణ EPDS అధికారిక వెబ్‌సైట్‌ https://epds.telangana.gov.in/FoodSecurityAct/?wicket:bookmarkablePage=:nic.fsc.foodsecurity.FscSearch. ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత తెలంగాణ రేషన్‌ కార్డు స్టేటస్‌ బట్టన్‌పై క్లిక్‌ చేయాలి.

4 /5

అక్కడ రేషన్‌ కార్డు నంబర్‌, FSC రిఫరెన్స్‌ నంబర్‌, జిల్లా, పేరు ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత సెర్చ్‌ బట్టన్‌ క్లిక్‌ చేయాలి. మీ రేషన్‌ కార్డు స్టేటస్‌ మీ ముందు కనిపిస్తుంది. రేషన్ కార్డు పొందాలంటే మీరు తెలంగాణ వాసి అయి ఉండాలి. ఫుడ్‌ సెక్యూరిటీ కార్డుకు దరఖాస్తు చేసుకుని ఉండాలి.    

5 /5

తెలంగాణ సర్కార్‌ జనవరి 26వ తేదీ నుంచి దరఖాస్తు చేపడుతున్నారు. అయితే, రేషన్‌ కార్డు జారీ ప్రక్రియ నిరంతరం. దీనికి డెడ్‌లైన్‌ ఉండదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం కల్పిస్తోంది.  మీరు అర్హులైతే రేషన్‌ కార్డు జారీ చేస్తారు. లేదా రిజెక్ట్‌ చేసే అవకాశం ఉంది.