Rishabh Pant: 16 కిలోలు బరువు తగ్గిన రిషబ్‌ పంత్‌ సీక్రెట్స్‌ ఇవే! వెయిట్‌ లాస్‌ చిట్కాలు

Rishabh Pant 16 Kg Weight Loss Journey Tips Here: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలో అత్యధిక ధర పలికి రికార్డు నెలకొల్పిన రిషబ్‌ పంత్‌పై మరోసారి అందరి దృష్టి పడింది. సంచలనాలకు మారుపేరుగా నిలిచే పంత్‌ గతంలో బొద్దుగా.. ఊబకాయంతో బాధపడేవాడు. ఇప్పుడు నాజుగా మారడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అవి మీరు తెలుసుకుని బరువు తగ్గేయండి.

1 /9

నాలుగు నెలల్లో 16 కిలోలు బరువు తగ్గిన రిషబ్‌ పంత్‌ డైట్‌ పద్ధతులు ఇవే

2 /9

ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి రిషబ్‌ పంత్‌ సంచలనం రేపగా.. అతడు బరువు తగ్గి కూడా అందరికీ విస్మయం కలిగించాడు.

3 /9

గతంలో బొద్దుగా ఉన్న రిషబ్‌ పంత్‌ అనూహ్యంగా బరువు తగ్గడం వెనుక చాలా పద్ధతులు.. ప్రత్యేక డైట్‌ పాటించాడు. అవి మీరు తెలుసుకోండి.

4 /9

నాలుగు నెలల్లో 16 కిలోలు బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పంత్‌ పాటించిన చిట్కాలు తెలుసుకుని మీరు బరువు తగ్గండి.

5 /9

కేలరీలు తక్కువ ఉన్న ఆహారానికి పంత్‌ ప్రాధాన్యం ఇచ్చాడు. ఇలా చేయడం శరీరంలో నిల్వ ఉన్న లేదా అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఇలా చేస్తే బరువు తగ్గుతుంది.

6 /9

ఇంటి భోజనం మాత్రమే పంత్‌ తీసుకున్నాడు. జంక్‌ ఫుడ్‌.. బయటి ఆహారానికి దూరమయ్యాడు. కుటుంబసభ్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని పంత్‌కు ప్రత్యేక ఆహారం అందించడంతో బరువు తగ్గడానికి కారణమైంది. మీరు కూడా ఇంట్లోని ఆహారమే తీసుకుంటే బరువు తగ్గడానికి ఆస్కారం ఉంది. రెస్టారెంట్లు, హోటల్స్‌కు వెళ్లి తింటే బరువు పెరుగుతారు.

7 /9

ముఖ్యంగా రిషబ్‌ పంత్‌ మిఠాయిలకు దూరంగా ఉన్నాడు. స్వీట్స్‌లలో అత్యధిక క్యాలరీలు ఉండడంతో వాటిని దూరం చేశాడు. దీనితోపాటు ఫ్రై పదార్థాలు, బిర్యానీ కూడా తినలేదంట.

8 /9

వేళకు నిద్రపోవడం రిషబ్‌ పంత్‌ బరువు తగ్గుదలకు ఒక కారణం. శరీరానికి సరైన నిద్ర ఉంటే బరువు నియంత్రణలో ఉంటుందనే విషయాన్ని గుర్తించండి.

9 /9

మసాలా ధినుసులు అనేవి పంత్‌ ఆహారంలో అసలు ఉండేవి కావు. రుచి బాగున్నా ఆరోగ్య రీత్యా మసాలా ధినుసులకు దూరం ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది.