Samyuktha Menon: గ్లామర్ డోస్ మరింత పెంచిన సంయుక్త.. హాట్ హాట్ ఫోజుల్లో కొత్త ఫోటోలు

Samyuktha Menon Instagram Photos: ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా తరచూ అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది హీరోయిన్ సంయుక్త. ప్రస్తుతం ఈ నటి షేర్ చేసిన ఫోటోలు మరోసారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

1 /5

పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన బీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్.. సంయుక్త మీనన్. చూడడానికి కొంచెం సమంతా లాగా ఉండడంతో ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయింది.  

2 /5

భీమ్లా నాయక్ సినిమాలో హీరో రానాకి జోడిగా కనిపించింది ఈ హీరోయిన్. ఇక ఆ తరువాత వెంటనే సంయుక్త తెలుగులో నటించిన.. కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమా కూడా మంచి విజయం సాధించింది.

3 /5

కానీ బింబిసార సినిమాలో సంయుక్తకి ప్రాధాన్యత ఉన్న పాత్ర మాత్రం దక్కలేదు. ఇక సాయిధరమ్ తేజ్ తో చేసిన విరూపాక్ష.. సినిమా నటిగా సంయుక్త కి మంచి పేరు తెచ్చి పెట్టింది.

4 /5

విరూపాక్ష సంయుక్త పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో.. ఆ పాత్రలో బాగా నటించి మంచి మార్కులు సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఇక ధనుష్ తో చేసిన సార్ సినిమా కూడా సంయుక్తకి విజయం అందించింది.

5 /5

త్వరలోనే హిందీ ఇండస్ట్రీలోకి సైతం అడుగుపెట్టనున్న..ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. ఆమె అభిమానులను ఫిదా చేస్తున్నాయి.