Shani Dev Transit: సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అలా సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మరక రాశిలోకి ప్రవేశించే శుభ సమయాన్నే మకర సంక్రాంతిగా మనం చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ సారి మకర సంక్రాంతి తర్వాత శని దేవుడు కూడా త్వరలో వేరే రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో గత కొన్నేళ్లుగా శని దేవుడు వల్ల అష్టకష్టాలు పడుతున్న ఈ రాశుల వారికి ఇక అంతా శుభమే జరగనుంది.
త్వరలో శనిశ్వరుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు.ప్రస్తుతం కుంభంలో ఉన్న శని దేవుడు కుంభరాశి నుంచి మీనంలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు పటాపంచలు కాబోతునున్నాయి.
కర్కాటక రాశి.. శని దేవుడు మీనరాశిలో ప్రవేశం వలన చేసే వృత్తి వ్యాపారాల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. వ్యాపారంలో అనుకోని లాభాలు అందుకుంటారు. గత కొన్నేళ్లుగా ఆగిపోయిన ధనం మీ చేతికి అందుతుంది.
మీన రాశి.. మకర సంక్రాంతి తర్వాత శని తన రాశి మార్చుకోబోతుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనుకోని అదృష్టం వలన ధనలాభం కలగనుంది. అంతేకాదు ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు జీతంలో పెరుగుదల ఉండనుంది. కష్టపడ్డ వారికి కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు. కుంటుంబంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొంటాయి.
తులా రాశి.. తులా రాశి వారికి శనిదేవుడు రాశి మార్పు కారణంగా అనుకున్న లక్ష్యాలను అధిగమిస్తారు. పనిలో స్థిరత్వం ఉంటుంది.ఆదాంలో పెరుగుదల వలన గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న ఆర్ధిక కష్టాల నుంచి బయటపడతారు.
కుంభ రాశి.. శనిదేవుడు మీన రాశిలో ప్రవేశం వలన కుంభ రాశికి వారికీ కూడా యోగ కాలం అని చెప్పాలి. శనిదేవుడి ఏడున్నర యేళ్ల కాలంలో ఐదేళ్లు పూర్తి కాబోతున్నాయి. అంతేకాదు మరో రెండున్నరేళ్లు వీరికి మిశ్రమ ఫలితాలుంటాయి. శని వారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం వలన అనుకోని లాభాలను అందుకుంటారు.
గమనిక: ఈ కథనం మతపరమైన, జ్యోతిష్యులు, పండితులు, నెట్ లో ఇచ్చిన సమాచారాన్ని మా ప్రేక్షకు దేవుళ్లకు అందించాము. జీ న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.