Slowest Train in India: ఇండియన్ రైల్వే కొన్ని లక్షల మందిని ప్రతిరోజూ తమ గమ్య స్థానాలకు చేరుస్తుంది. నిత్యం వేల వందలాది రైళ్లు ప్రయాణిస్తూనే ఉంటాయి. సరసమైన ధరల్లో అందుబాటులో ఉండటం, తక్కువ సమయంలో గమ్య స్థానానికి చేర్చడంతో మన దేశంలో ఎక్కువ శాతం మంది రైలులో ప్రయాణం చేస్తారు. అయితే, దేశంలోనే నెమ్మదిగా వెళ్లే రైలు ఏది మీకు తెలుసా? అదే హౌరా నుంచి అమృతసర్ వెళ్లే రైలు. ఇది దేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు.
ఈ రైలు టిక్కెట్ ధరలు చాలా తక్కువ ధరలోనే ఉంటుంది. అందుకే ఈ రైలు ఎక్కడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. స్లీపర్ క్లాస్ అయితే రూ.695, థర్డ్ ఏసీ రూ.1,870, సెకండ్ ఏసీ రూ.2,755, ఫస్ట్ ఏసీ రూ.4,835 ధరలు ఉంటాయి.
కొండలు, నదులు, గుట్టలు దాటుతూ రైలు ప్రయాణం చేస్తాం. ప్రతి స్టాప్‌లో కొంతమంది ఎక్కుతారు. మరికొంతమంది దిగుతారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు రైలు ప్రయాణం చేయవచ్చు. కొన్ని నాన్‌స్టాప్ వెళ్తే మరికొన్ని లాంగ్ ట్రావెల్ చేస్తాయి.
కానీ, హౌరా నుంచి అమృతసర్ వెళ్లే మెయిల్ మాత్రం చాలా నెమ్మదిగ వెళ్లే రైలుగా రికార్డు క్రియేట్ చేసింది. ఇది పశ్చిమబెంగాల్‌లో ఉన్న హౌరా నుంచి పంజాబ్‌లో ఉన్న అమృతసర్ వరకు ప్రయాణిస్తంది. ఈ రెండిటీ మధ్య దూరం 1,190 కిలో మీటర్లు, 111 స్టాప్, 37 గంటల ప్రయాణం కొనసాగుతుంది.
ఈ రైలు స్టాపులు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది రైలు ఎక్కుతారు. మొత్తం 5 రాష్ట్రాలను ఈ మెయిల్ కవర్ చేస్తుంది. ఇందులో పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బిహార్, పంజాబ్, హరియాణలోని వివిధ మార్గాల గుండా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
కొన్ని స్టాపుల్లో ఈ రైలు ఎక్కువ సమయంపాటు ఆగుతుంది. చిన్న చిన్న స్టేషన్లలో అయితే ఓ రెండు నిమిషాలు ఆగుతుంది. ఇది హౌరా నుంచి రాత్రి 7:15 నిమిషాలకు ప్రారంభమవుతే మూడో రోజు అమృతసర్‌లో ఉదయం 8:40 చేరుకుంటుంది. అయితే అదేరోజు సాయంత్రం 6:25 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. హైరా స్టేషన్‌కు మూడోరోజు ఉదయం 7:30 నిమిషాలకు చేరుకుంటుంది.