Sr NTR Son: గవర్నమెంట్ జాబ్ చేస్తోన్న సీనియర్ ఎన్టీఆర్ కొడుకు.. ఇంతకీ ఎవరో తెలుసా..


Sr NTR Son: నందమూరి తారక రామారావు పేరు కాదు. ఓ చరిత్ర. తెలుగులో తొలి మాస్ హీరోగా దాదాపు ముప్పై యేళ్లు నెంబర్ వన్ హీరోగా రఫ్పాడించారు. అంతేకాదు  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో సీఎంగా అధికారం చేపట్టి సంచలనం రేపారు. ఈయన కుమారుల్లో ఒకతను ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరో తెలుసా..

 

1 /5

Sr NTR Son: సీనియర్ ఎన్టీఆర్ కుమారులు.. పెద్ద బంగళా.. కార్లు.. నౌకర్లు.. చాకర్లు హడావుడి కాస్త ఎక్కువే ఉంటుందనుకుంటే పొరపడినట్టే. అన్నగారు హీరోగా.. ముఖ్యమంత్రిగా పనిచేసినా.. ఆయన కుమారుల్లో ఒకతను సింపుల్ గా గవర్నమెంట్ జాబ్ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

2 /5

మాములుగా హీరోలు, పొలిటిషన్స్  కుమారులంటే ఆ దర్జానే వేరు. కానీ అన్నగారి కుమారుల్లో చాలా మంది ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అందులో అందరికీ తెలిసిన పేరు నందమూరి బాలకృష్ణదే. రీసెంట్ గా ఈయనను కేంద్ర పద్మభూషణ్ తో గౌరవించింది. మరోవైపు దివంగత హరికృష్ణ, నిర్మాత అయిన రామకృష్ణ మాత్రమే చాలా మందికి తెలుసు.

3 /5

కానీ పెద్ద ఎన్టీఆర్ కు ముందుగా రామకృష్ణ అనే కుమారుడు ఓ వ్యాధితో చనిపోవడంతో ఏడో కుమారడికి రామకృష్ణ పేరు పెట్టారు అన్నగారు. ఇక ఎన్టీఆర్ జయకృష్ణ, సాయి కృష్ణ, మోహన కృష్ణ, హరి కృష్ణ, బాలకృష్ణ, రామ కృష్ణ, జయ శంకర కృష్ణ ఉన్నారు.

4 /5

వీరిలో సాయి కృష్ణ, హరి కృష్ణ కాలం చేశారు. జయకృష్ణ ఎన్టీఆర్ పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. మోహన కృష్ణ.. సినిమాటోగ్రఫర్ గా పనిచేసారు. ఎక్కువగా తండ్రి, తమ్ముడు బాలయ్య సినిమాలకు పనిచేశారు. రామకృష్ణ.. రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ పతాకంపై పలు చిత్రాలను నిర్మించారు.  

5 /5

ఇక చివరాయన జయ శంకర కృష్ణ.. ఈయన బయట పెద్దగా కనపబడడు. ఈయన చెన్నెలో ఎల్ ఐసీలో ఆఫీసర్ గా పనిచేస్తున్నారట. అంతేకాదు చెన్నైలోనే ఉంటూ అక్కడ నందమూరి కుటుంబ సభ్యుల ఆస్తులను చూసుకుంటున్నారట. మాజీ సీఎం కుమారుడు, ప్రస్తుతం సీఎం బామ్మర్ధిగా ఉంటూ కూడా ఇలా సింపుల్ గా అవినీతికి పాల్పడకుండా  లైఫ్ లీడ్ చేయడం ఒక్క అన్నగారి కుమారులకే చెల్లింది.