Sunflower seeds: జంక్ ఫుడ్ బదులు.. గుప్పెడు సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటే మీ గుండె గట్టిదవుతుంది..

Sunflower Seeds For Heart Patients: పొద్దుతిరుగుడు విత్తనాలు పోషకాలకు పవర్ హౌస్. ఇందులో ఖనిజాలు ఉంటాయి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డామేజ్ కాకుండా కాపాడుతాయి. అంతే కాదు ఇందులో విటమిన్ బి కూడా ఉంటుంది.. ఇవి నరాల ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం కూడా ఉంటుంది. శరీర ఆరోగ్య పనితీరుకు సహాయపడుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలతో గుండెకు మేలు జరుగుతుంది.
 

1 /5

Sunflower Seeds For Heart Patients: సాధారణంగా ఉదయం ఓట్స్ తినేటప్పుడు పొద్దుతిరుగుడు విత్తనాలు జల్లుకొని తినవచ్చు. వీటిని సలాడ్ లేకపోతే నేరుగా కూడా తినే అవకాశం కూడా ఉంటుంది. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల హార్ట్ పేషంట్లకు కూడా వరం.  ఈ విత్తనాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

2 /5

గుండె ఆరోగ్యానికి పొద్దుతిరుగుడు విత్తనాలు సహాయపడితే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, మోనోఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ పెంచుతాయి.  ఈ పొద్దు తిరుగుడు విత్తనాలు, అవకాడో కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆరోగ్యకరమైన గింజలు విత్తనాలతో కలిపి తీసుకోవచ్చు.  

3 /5

పొద్దుతిరుగుడు విత్తనాలు తరచూ డైట్ లో చేర్చుకోవడం వల్ల జింక్, సెలీనియం ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. కణాల పనితీరుకు ప్రేరేపిస్తుంది. సెలీనియం మన ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా మారుతుంది. సాయంత్రం స్నాక్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ పొద్దు తిరుగుడు విత్తనాల్లో పోషకాలు పుష్కలం ఇమ్యూనిటీని బూస్ట్ చేసే గుణాలు కలిగి ఉండటం దీన్ని స్ప్రెడ్ లేదా డ్రెస్సింగ్ రూపంలో కూడా వేసుకొని తినవచ్చు.  

4 /5

పొద్దుతిరుగుడు విత్తనాలతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందానికి కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది చర్మానికి సాగే గుణం అందించి, డ్యామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్ నుంచి కాపాడుతుంది. దీంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.  పొద్దుతిరుగుడు విత్తనాలను స్ర్కబ్‌ మాదిరి కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఎక్స్‌ఫోలియేషన్‌ గుణాలు ఉంటాయి. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.  

5 /5

బరువు నిర్వహణకు కూడా పొద్దుతిరుగుడు విత్తనాలు సహకరిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది. కడుపునిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కల్పిస్తాయి. దీంతో అనారోగ్యకరమైన ఆహార ఆహారాలు తీసుకోకుండా ఉంటాము. ఉదయం పొద్దుతిరుగుడు విత్తనాలు గుప్పెడు తీసుకున్న మనకు ఆకలి వేయకుండా ఉంటుంది.