Telangana Ugadi Gift: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఎన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉగాది పండుగ సందర్భంగా కానుక ప్రకటించనుంది. దీంతో అందరూ ఆ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు హామీలు నెరవేరుస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది కానుక కూడా ప్రకటించనుంది. ఈ శుభవార్తను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రాషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇచ్చేందుకు సన్నద్ధమైంది ఈ మేరకు భారీ ఏర్పాట్లను పూర్తి చేసింది.
ప్రతి రేషన్ కార్డుదారులకు ఒక కుటుంబ సభ్యుడికి ఆరు కిలోలు చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. జనవరి 26వ తేదీనే ఇది పంపిణీ ప్రారంభం అవాల్సి ఉండగా కాస్త జాప్యం జరిగింది.
ఇప్పటికే 4.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం రేషన్ కార్డు పై పంపిణీ చేయడానికి సన్నద్ధమైంది ప్రభుత్వం. రానున్న ఉగాది పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఇదిలా ఉండగా కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కడుతున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల చేర్చడం తీసివేతలు కూడా అవకాశం కల్పిస్తోంది. పాత రేషన్ కార్డులో పేరు తొలగించి తర్వాత కొత్త రాష్ట్రం కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.