Tgrtc Good News: టీజీఎస్ఆర్టీసీ నుంచి గుడ్‌ న్యూస్‌..టికెట్ ఛార్జీలు 10 శాతం తగ్గింపు!

Tgrtc Good News Tickets Price Decrease: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వారిని ఆకట్టుకునేందుకు బంఫర్‌ ఆఫర్స్‌ను తీసుకువస్తోంది. గతంలో రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే ఉన్న మనీ గిఫ్ట్‌ను ఇప్పుడు TGSRTC దసరా, సంక్రాంతి ఫెస్టివెల్స్‌ సీజన్స్‌లో కూడా దీనిని అమలు చేసేందుకుందుకు కీలక నిర్ణయం తీసుకోబోతోంది..
 

1 /5

ఇదిలా ఉంటే TGSRTCకి సంబంధించిన మరో కొత్త ఆఫర్ తెర మీదికి వచ్చింది. ముఖ్యంగా దూరప్రయాణాలతో పాటు ఈ టీఎస్ఆర్టీసీ సంస్థ సూచించిన కొన్ని రూట్లలో ప్రయాణాలు చేసేవారికి ఛార్జిపై దాదాపు 10 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది..  

2 /5

ఇక ఈ 10 శాతానికి సంబంధించిన డిస్కౌంట్‌ వివరాల్లోకి వెళితే.. కేవలం హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య నడిచే సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి ఏసీ TGSRTC సంబంధించిన బస్సుల్లో మాత్రమే ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు  టీఎస్ఆర్టీసీ తెలిపింది.  

3 /5

టీఎస్ఆర్టీసీ బెంగళూరు వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి బెంగళూరుకు దాదాపు  24కు పైగా సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో నిత్యం చాలా మంది ప్రయాణిస్తున్నారు. అయితే వీరిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది..

4 /5

టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో ఈ ఛార్జిలపై 10 శాతం డిస్కౌంట్ అమల్లోకి వచ్చింది. అయితే ఈ డిస్కౌంట్‌ వర్తిస్తే ప్రతి టికెట్‌పై దాదాపు రూ.100 నుంచి రూ.160 వరకు తగ్గింపు లభించనుంది.  

5 /5

ప్రస్తుతం బెంగళూరు  ఏసీ స్లీపర్‌ టికెట్‌ ధర రూ. 1,569 కాగా ఈ 10 శాతం వరకు డిస్కౌంట్‌ అప్లై అయ్యి..రూ. 1,412 వరకు తగ్గుతుంది. ఇక సూపర్‌ లగ్జరీ టికెట్‌ ధర ఇంతక ముందు రూ. 946 కాగా ఇప్పుడు రూ.851 తగ్గింపుతో లభిస్తోంది.