Viral Video: తన భార్యకోసం ఒక వ్యక్తి బస్సులో సీటుకోసం కడ్చీఫ్ వేశాడు. కానీ మరోక వ్యక్తి ఆ సీట్లో తన భార్యను కూర్చుండ బెట్టాడు. ఇది చూసి మరో వ్యక్తి ఆవేశంతో ఊగిపోయాడు. తన భార్యకు కూర్చునే సీటులో ఎలా కూర్చుంటావంటూ కూడా గొడవకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
TSRTC Bus: బస్సులో కండక్టర్ లను బూతులు తిడుతున్న వీడియో వైరల్ గా మారింది. చిల్లర లేదనడంతో సదరు మహిళ ఇష్టమోచ్చినట్లు బూతులు తిడుతూ రెచ్చిపోయింది. చిల్లర ఇవ్వాలన్న కండక్టర్ పై బూతులు తిడుతూ దాడులకు పాల్పడింది.
Bus Stuck in Flood Water Near Mulugu: హైదరాబాద్ నుంచి ములుగు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ములుగు సమీపంలో ఘట్టమ్మ ఆలయం, జాకారం మధ్య వరదలో చిక్కుకుంది. ఇక్కడ రహదారిపై వరద తాకిడి అధికంగా ఉండటంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయి ఆగిపోయింది. బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.
TSRTC AC Sleeper Bus: టీఎస్ఆర్టీసీ సరికొత్త బస్సులను ప్రవేశపెట్టనుంది. అత్యాధునిక వసతులతో ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. సోమవారం ఈ బస్సులు ప్రారంభంకానున్నాయి. బస్సులో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి..? ఏయే నగరాలకు అందుబాటులోకి రానున్నాయి..?
RTC BUS FAIL : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు రహదారి మధ్యలో ఆగిపోవడం తో ఇతర దేశాలకు వెళ్లేందుకు విమాన టికెట్లు కొనుకున్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జగిత్యాల డిపో కు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఇవాళ తెల్లవారుజామున వెళ్లాల్సి ఉంది. అయితే బస్సులో గేర్ లింక్ పోవడం వల్ల పెగడపల్లి మండలం అరవెల్లి గ్రామంలో బస్సు అగిపోయింది.దీంతో గంటల తరబడి రోడ్డు పై ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.
TSRTC: టీఎస్ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమం తీసుకొచ్చింది. సామాన్యులకు మరింత దగ్గరయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
TSRTC Special Buses: సంక్రాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలు సహా ఏపీలోని ముఖ్య ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఈనెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.
TSRTC bus catches fire: హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైన ఘటన జనగాం జిల్లా స్టేషన్ ఘణపూర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు (Super luxury bus caught fire) వెనుక భాగంలో మంటలు చెలరేగాయి.
లాక్డౌన్ సడలింపుల ( Lockdown guidelines) అనంతరం కరోనావైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. తెలంగాణలో మంగళవారం కొత్తగా 42 కరోనావైరస్ పాజిటివ్ కేసులను ( Coronavirus positive cases ) గుర్తించగా అందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోవి 34 కాగా.. వలస కార్మికులు 8 మంది ఉన్నారు.
తెలంగాణలో నేడు కొత్తగా 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus positive cases ) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో 15 కేసులు జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో నమోదు కాగా మరో 12 మంది వలసకూలీలు ( Migrant workers ) ఉన్నారు.
తెలంగాణలో మే 31 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించిన సీఎం కేసీఆర్.. కంటైన్మెంట్ జోన్, గ్రీన్ జోన్ అని జోన్లతో సంబంధం లేకుండా కొన్ని రకాల సేవలు, వ్యాపారాలకు మాత్రం అనుమతులు ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం సర్కార్ తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు.
తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కంటైన్మెంట్ జోన్స్ మినహా మిగతా అన్ని జోన్లను గ్రీన్ జోన్స్ గానే పరిగణించనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. గ్రీన్ జోన్లలో సడలింపులు ఉన్నప్పటికీ.. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠినమైన నిబంధనలతో లాక్డౌన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు.
టిఎస్ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో తలెత్తిన వివాదం కాస్తా ఘర్షణకు దారి తీయడమేకాకుండా కత్తితో దాడికి పాల్పడే వరకు వెళ్లింది. అనురాధపై దాడికి పాల్పడిన అనంతరం బేగంబజార్ వద్ద బస్సు దిగి పారిపోయిన నిందితుడి కోసం ప్రస్తుతం బేగంబజార్ పోలీసులు గాలిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి-అడవి శ్రీరాంపూర్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
హైదరాబాద్ జాతీయ రహదారిపై విజయవాడలోని భవానీపురం వద్ద పలువురు ఆకతాయిలు శనివారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. రహదారిపై తమ బైకులకు సైడ్ ఇవ్వలేదనే ఆగ్రహంతో రెచ్చిపోయిన యువకులు పది ద్విచక్రవాహనాలపై బస్సును వెంబడించి గొల్లపూడి సెంటర్ వద్ద బస్సును ఓవర్ టేక్ చేసి అడ్డుకున్నారు. అనంతరం బస్ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.