Thandel 2nd Day Box Office collection: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్ఫణలో బన్నీ వాస్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. 2వ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసింది.
Thandel 2nd Day Box Office collection:గత కొన్నేళ్లుగా నాగ చైతన్య హీరోగా యాక్ట్ చేసిన ఏ చిత్రానికి రానటు వంటి పాజిటివ్ తో సినిమా ఓపెన్ అయింది. అంతేకాదు మొదటి రోజు దాదాపు రూ. 21 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లను రాబట్టింది తండేల్ మూవీ.
తండేల్ మూవీ నాగ చైతన్య సినీ కెరీర్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ డే చైతూ సోలో హీరోగా గత రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాలో రూ. 8 కోట్ల షేర్ రాబట్టింది.
నాగ చైతన్య అంటే అన్నింటికీ ఒకటే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాడనేది మొన్నటి వరకు ఉన్న టాక్. అక్కినేని ఫ్యామిలీ లెగసీని కాపాడుతాడనే అనే డౌట్స్ కూడా ఉండేవి. కానీ తండేల్ మూవీలో నటుడిగా నాగ చైతన్య చూపించిన పరిణితి మెచ్చుకోవాల్సిందే. ‘తండేల్’ మూవీతో హీరోగా మరో మెట్టు పైకెక్కాడనే చెప్పాలి.
నాగ చైతన్య అంటే రొమాంటిక్ హీరోగానే గుర్తుకు వస్తాడు. కానీ ఈ సినిమాలో చైతూలోని అన్ని రసాలను పిండేసాడు దర్శకుడు చందూ మొండేటి. మొత్తంగా చైతూ కెరీర్ లో ‘తండేల్’ ముందు .. తండేల్ తర్వాత అని చెప్పుకోవాలి. ఈ సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా రూ. 41.20 కోట్ల గ్రాస్.. (రూ. 22 కోట్ల షేర్) రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దాదాపు 60 శాతం రికవరీ సాధించిన ఈ సినిమా ఈ రోజుతో పాటు వచ్చే వీక్ వరకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లో వచ్చే అవకాశాలున్నాయి. బాక్సాఫీస్ దగ్గర రూ. 15 కోట్ల రాబడితే హిట్ స్టేటస్ అందుకున్నట్టే. ‘తండేల్’ మూవీ ఓవర్సీస్ లో దాదాపు హాఫ్ మిలియన్ మార్క్ దాటింది. త్వరలో వన్ మిలియన్ మార్క్ దాటే అవకాశాలున్నాయి. నాగ చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో నాగ చైతన్య ‘తండేల్ రాజు’ పాత్రలో ఒదిగిపోయాడు. సాయి పల్లవి ‘సత్య’ పాత్రలో ఒదిగిపోయింది.