Snake viral news: బహిర్భూమికి వెళ్లిన ఒక మహిళ పాము కాటుకు గురైంది. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి తన భర్తకు విషయంను చెప్పింది.
పాములు అడవులు, చెట్ల పొదల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పాములు ఉంటాయి. పొలాల్లో కూడా ఎక్కువగా తిరుగుతుంటాయి. ముఖ్యంగా పాములు రాత్రిపూట బైటకు వస్తుంటాయి.
ఇటీవల ఏపీలోని విజయనగరం జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఎల్ కోట మండలం లింగంపేటలో సత్యవతి తన భర్త సన్యాసయ్యతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఇటీవల రాత్రి పూట భోజనం చేశాక బహిర్బూమికి వెళ్లింది.
అక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మహిళ రాత్రి పూట ఏదో కాటు వేసినట్లు అన్పించి అక్కడ చూసింది. పెద్ద సర్పం మహిళ కంట పడింది. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి తన భర్తకు చెప్పింది. కంగారు పడిన కుటుంబం ఎల్ కోట ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ దగ్గరకు వెళ్లారు.
సదరు మహిళకు వైద్యులు సకాలంలో మెరుగైన వైద్యం అందించారు.దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బైటపడింది.దీంతో సత్యవతి కుటుంబం ఊపిరి పీల్చుకున్నారు. పాము కాటేసిన ప్రదేశం గురించి భర్త ఆరాతీశాడు.
ఉదయం కర్రలు పట్టుకుని మహిళ చెప్పిన ప్రదేశంకు వెళ్లి చూశారు. దీంతో అక్కడ ఒక పాము చనిపోయి కన్పించింది . దీంతో భర్త, అక్కడి ప్రజలు ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని వెంటనే వైద్యులకు చెప్పారు. దీనికి వారు.. సదరు మహిళ పాము కాటు వేసిందని తొందరలో దాన్ని తొక్కి ఉంటుందని లేదా అది అప్పటికే చనిపోయే స్థితిలో ఉండివచ్చని కూడా వైద్యులు క్లారిటీ ఇచ్చారు.
కానీ అక్కడి ప్రజలు మాత్రం మహిళను కాటు వేసిన తర్వాత పాము ప్రాణం విడిచిందని వింతగా చెప్పుకుంటున్నారు. మరికొందరు ఆ మహిళకు ఏదో శక్తులు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు. దీంతో మహిళను చూసేందుకు స్థానికులు పెద్దు ఎత్తున ఆమె ఇంటికి చేరుకుంటున్నారంట. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.