Hacks For Clothes Fast Drying In Winter: చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి కొన్ని రోజులు సూర్యుడు కూడా కనిపించని పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో బట్టలు ఉతికితే అస్సలు ఆరవు. రెండు మూడు రోజులైనా తడిగానే ఉంటాయి. అలాంటి సమయంలో త్వరగా బట్టలు ఆరేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఉతికిన బట్టలు తేలికగా ఆరేందుకు ఈ చిట్కాలు పాటించండి.
చలికాలంలో త్వరగా బట్టలు ఎండవు. ఎక్కువ సేపు తడిగా ఉంటే బట్టలు వాసన వస్తాయి. ఈ సమస్య రాకుండా చిట్కాలు కొన్ని ఉన్నాయి.
చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉండకపోవడంతో ఉతికిన బట్టలు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. బట్టలు తడిగా ఉండి ఆరబెట్టడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.
ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి ఎండలు.. పొడి వాతావరణం లేకపోవడంతో త్వరగా బట్టలు ఆరవు. బట్టలు ఆరాలంటే ఇలా చేయాలి.
ఉతికిన బట్టలను ఇస్త్రీతో ఆరబెట్టవచ్చు. ముందుగా కాటన్ గుడ్డను పరచి దానిపై తడి బట్టలు వేయాలి. తర్వాత వాటిపై కాటన్ దుప్పటి లేదా బట్ట వేసి ఆపై ఇస్త్రీ చేయాలి. దీంతో బట్టలు త్వరగా ఆరిపోతాయి.
బట్టలు ఆరబెట్టడానికి ఏసీలోని హీటర్ కూడా ఉపయోగపడుతుంది. తడి బట్టలు ఏసీ కింద ఉంచి వేడిని ఆన్ చేయండి. ఏసీలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఆన్ చేసి ఉంచితే ఆ వేడికి బట్టల్లోని తేమ తగ్గి కొన్ని గంటల్లోనే బట్టలు ఆరిపోతాయి.
శీతాకాలంలో తడి బట్టలు ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్‌ను కూడా ఉపయోగించవచ్చు. జుట్టును ఆరబెట్టే హెయిర్ డ్రయర్ వేడి గాలితో బట్టలను సులభంగా ఆరబెట్టుకోవచ్చు.