Winter Health Tips: చలికాలంలో గుండె ముప్పు ఎక్కువే, ఈ 5 పదార్ధాలతో గుండెకు రక్షణ

చలికాలంలో గుండెపోటు సమస్యలు అధికంగా ఉంటాయి. కారణం రక్తం చిక్కగా మారడం. చలికాలంలో సాధారణంగా రక్త సరఫరా కూడా సరిగ్గా ఉండదు. రక్తం చిక్కగా ఉండటంతో..రక్తం, ఆక్సిజన్ గుండె వరకూ చేరడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ రావచ్చు

Winter Health Tips: చలికాలంలో గుండెపోటు సమస్యలు అధికంగా ఉంటాయి. కారణం రక్తం చిక్కగా మారడం. చలికాలంలో సాధారణంగా రక్త సరఫరా కూడా సరిగ్గా ఉండదు. రక్తం చిక్కగా ఉండటంతో..రక్తం, ఆక్సిజన్ గుండె వరకూ చేరడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ రావచ్చు

1 /5

పసుపు అనేది నేచురల్ బ్లడ్ థిన్నర్‌గా పనిచేస్తుంది. ఇందులో కర్‌క్యూమిన్ అనే పోషక పదార్ధం ఉంటుంది. ఇది రక్తాన్ని పల్చగా చేస్తుంది. పసుపు తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టడం జరగదు. రోజూ వేడి పాలలో పసుపు కలుపుకుని తాగితే ప్రయోజనాలు అధికం

2 /5

అల్లంలో చాలారకాల ఔషద గుణాలున్నాయి. ఇందులో సెలిసిలెట్స్ ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచన చేస్తాయి. చలికాలంలో తీవ్రమైన వ్యాధుల్నించి కాపాడుకునేందుకు అల్లం మంచి పరిష్కారం.

3 /5

వెల్లుల్లిలో ఉండే పోషక గుణాలు రక్తాన్ని పలుచన చేస్తాయి. చలికాలంలో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పు నుంచి కాపాడుకునేందుకు వెల్లుల్లి మంచి ప్రత్యామ్నాయం. పచ్చి వెల్లుల్లి రెమ్మలు రోజుకు 1-2 తింటే చాలు.

4 /5

పండ్లు అందరికీ ఇష్టమే. అన్ని పండ్లు లాభదాయకమే. కానీ హార్ట్ ఎటాక్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు ద్రాక్ష, ఆరెంజ్, బెర్రీస్ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండ్లను డైట్‌లో భాగంగా చేసుకోవాలి.

5 /5

దాల్చినచెక్కలో కామ్‌రీన్ ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచన చేస్తుంది. దాల్చిన చెక్క తినడం వల్ల రక్తం చిక్కబడకుండా ఉంటుంది. దాల్చినచెక్కను కాడాగా చేసుకుని తాగవచ్చు.