FD Rates: ఈ ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా.. అయితే మీకు షాకింగ్ న్యూస్.. ఇకపై మీ జేబుపై కోత తప్పదు.. ఎందుకంటే

YES Bank Key Announcement:  ఆర్బిఐ త్వరలోనే కీలక రెపోరేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేస్తున్నాయి. ఇప్పుడు ఓ దిగ్గజ బ్యాంకు కూడా ఇదే పనిచేసింది. ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించంది. ఇది నవంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 
 

1 /6

YES Bank Key Announcement: దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒక్కటైన యెస్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. డిపాజిట్ వడ్డీ రేట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎంపిక చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. రూ. 3కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లపై కొన్ని టెన్యూర్లపై గరిష్టంగా 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు తగ్గించింది. సవరించిన వడ్డీ రేట్లు నవంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 

2 /6

సవరించిన అనంతరం  ఈ బ్యాంకులో సాధారణ పౌరులకు వారం నుంచి 10ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై కనిష్టంగా 3.25శాతం నుంచి గరిష్టంగా 7.75శాతం వరకు వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు అయితే  3.75శాతం నుంచి 8.25శాతం వరకు వడ్దీ చెల్లిస్తుంది. అత్యధికంగా ఈ బ్యాంకులోనే 18 నెలల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపైనే అత్యధికంగా 7.75శాతం, 8.25శాతం వడ్డీ అందుతుంది. 

3 /6

అత్యధికంగా వడ్డీ వచ్చే 18 నెలల వ్యవధి డిపాజిట్లపైనే 25బేసిస్ పాయింట్ల మేర వడ్డీ కోత విధించింది. ఇదివరకు కూడా సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లకు వరుసగా 8శాతం, 8.50శాతం ఉండేది. ఇప్పుడు 7.75శాతం, 8.25శాతానికి తగ్గించింది. దీంతో డిపాజిట్ దారులు ఈ డిపాజిట్ పై గతంలో కంటే తక్కువ వడ్డీ చెల్లిస్తుంది. రెగ్యులర్ సిటిజెన్స్ కంటే సీనియర్ సిటిజన్లకు దాదాపు 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ ఎక్కువ వస్తుంది.   

4 /6

7-14 రోజుల డిపాజిట్లపై మామూలు ప్రజలకు  3.25శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75శాతం వడ్డీ అందించగా.. 15 నుంచి 45రోజుల ఎఫ్డీపై వరుసగా 3.70శాతం, 4.20శాతం వరకు వడ్డీ అందుతుంది. 181 నుంచి 271 రోజుల డిపాజిట్లపై  6.10 శాతం , 6.60శాతం వడ్డీ చెల్లిస్తుంది. 

5 /6

సంవత్సరం టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.25శాతం, 7.75శాతం వడ్డీ చెల్లిస్తుంది. సంవత్సరం నుంచి 18 నెలల డిపాజిట్లపై వరుసగా 7.50శాతం, 8శాతం వడ్డీ చెల్లిస్తుంది.  18 నెలల ఎఫ్డీపై దీని కంటే అదనంగా 25బేసిస్ పాయింట్స్ వరకు ఎక్కువగా వడ్డీ అందిస్తోంది.   

6 /6

ఈ బ్యాంకులో కనీసం రూ. 10వేల నుంచి ఎప్డీ డిపాజిట్ చేయవచ్చు. ప్రీమెచ్యూర్ విత్ డ్రా చేయాలనుకుంటే వడ్డీ రేట్లలో కోత పడుతుంది. 181 రోజుల కంటే తక్కువ వ్యవధిలో విత్ డ్రా చేసినట్లయితే 0.75శాతం, అంతకంటే ఎక్కువ అయితే 1శాతం వడ్డీ రేటు కూడా తగ్గుతుంది.