Cobra Viral Video: మనం నివసించే ప్రాంతాల్లో పాములు వస్తే.. వాటి నుంచి దూరంగా పారిపోవడం లేదా వాటిన చంపేందుకు ప్రయత్నిస్తుంటాము. అయితే ఒక్కోసారి పాములు వాతావరణ మార్పులను బట్టి సరైన ప్రదేశానికి ఎంచుకుంటాయి. ఈ క్రమంలో వేసవి కాలంలో చల్లని ప్రదేశం కోసం.. అదే విధంగా శీతాకాలంలో వేడి ప్రదేశాల కోసం వెతుకుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే పాములు ఇంట్లోకి చొరబడతాయి.
ఈ విధంగా కొంతమంది తమ ఇళ్లలో పాములను ఏదో రకంగా చూసే ఉంటారు. అయితే ఇంట్లోని అనేక ప్రదేశాల్లో పాములు ఎక్కడ దాక్కుంటాయో కూడా మనం కనిపెట్టలేము. అలాంటి పరిస్థితుల్లో సడెన్ గా వాటిని చూస్తే గుండె జారిపోయినంత పని అవుతుంది. ఇలాంటి ఓ ఘటనే థాయ్ లాండ్ లోని ఓ ఇంట్లో జరిగింది. బయట వేడి వాతావరణం కారణంగా ఓ ఇంట్లోకి బాత్ రూమ్ లోకి చొరబడిన కోబ్రా.. అటుగా వెళ్లిన మహిళను భయాందోళనకు గురిచేసింది.
ఏం జరిగిందంటే?
థాయ్ లాండ్ లోని ఓ ఇంటి బాత్ రూమ్ లో కింగ్ కోబ్రా దాక్కొని ఉంది. అటుగా వెళ్లిన ఆ ఇంటి మహిళ.. ఆ పామును సడెన్ గా చూసి షాక్ గురైంది. వెంటనే తన కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని తెలియజేసింది. వెంటనే వారంతా ఆ పాము బాత్ రూమ్ నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు చేపట్టారు. అనంతం పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు.
A woman in Thailand was shocked to discover a giant snake in her bathroom. Luckily, animal experts were able to safely remove the reptile. It’s believed the snake was looking for a place to cool off from Thailand’s current high heat. pic.twitter.com/ZtNpegBB1Q
— NowThis (@nowthisnews) February 11, 2022
అక్కడికి వచ్చిన స్నేక్ రెస్క్యూ టీమ్ బాత్ రూమ్ లో దాగి ఉన్న కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో కింగ్ కోబ్రా ఎవరికి హాని చేయలేదు. బయట వేడి వాతావరణం కారణంగా పాము ఇంట్లోకి వచ్చి ఉంటుందని స్నేక్ రెస్క్యూ టీమ్ వెల్లడించింది. ఈ వీడియోను 'నౌ దిస్' అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 21 వేల మందికి పైగా చూశారు.
Also Read: Viral Video: డబ్బులు అడిగితే ఇవ్వవా.. అని చెప్పులు కొట్టేసిన కుర్రాడు వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook