Snakes Catchers Catching Giant Black King Cobra: అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం ముకుందాపురంలోని శివారు పొలాల్లో ఓ భారీ గిరి నాగు పాము కలకలం రేపింది. 14 అడుగుల పొడవు, నల్లగా, లావుగా ఉన్న అంత పెద్ద నాగు పామును చూసిన రైతులు ఒక్కసారిగా హడలిపోయి పొలాల్లోంచి పరుగులు తీశారు. అతి విషపూరితమైన పాము కావడం, అందులోనూ ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా అతి భయంకరంగా ఉండటంతో జనాలు ఆ పామును చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ముకుందాపురం గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న విశాఖపట్నం నుంచి వన్యప్రాణి సంరక్షణ ప్రతినిధి మూర్తి బృందం గిరి నాగు పాము ఉన్న పొలానికి చేరుకున్నారు. ఆ పంట పొలాల చుట్టూ భారీగా చెట్లు పెరిగి ఉండటం, తోటలు ఉండటంతో ఆ నాగు పాము ఎక్కడ దాగుందో కనిపెట్టడం ఒక పెను సవాలుగా మారింది. అయినప్పటికీ గ్రామస్తుల భయాందోళన చూసిన స్నేక్ క్యాచర్స్ గంట సేపు తీవ్రంగా శ్రమించి.. పామును సజీవంగా పట్టుకున్నారు.
ఇది కూడా చదవండి : Gaddar: మూగబోయిన ఉద్యమ గళం.. నేడు అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు..
ఆ పామును పట్టుకునే క్రమంలో, పట్టుకున్న తరువాత అది బుసలు కొడుతూ తిరగబడిన తీరు స్నేక్ క్యాచర్స్‌కి సైతం సవాల్ విసిరినట్టు కనిపించింది. ఆ గిరి నాగు పామును ఓ సంచిలో బంధించి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు అటవీ శాఖ అధికారి శివకుమార్ చెప్పారు. ఆ గిరి నాగు పాము పొడవు దాదాపుగా 14 అడుగులు 12 కేజీల బరువుకిపైనే ఉందని స్నేక్ క్యాచర్స్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద గిరి నాగు పామును చూడడం ఇదే తొలిసారి అని స్థానికులు చెప్పారు. అంత భయంకరంగా బుసలు కొడుతూ కనిపించిన నాగు పామును పట్టుకోవడంతో రైతులు కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి : Gaddar Last Interview With Zee Telugu News: గద్దర్ చివరి ఇంటర్వ్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి