Leopard Hunting Video: కసిగా వేటాడిన చిరుతపులి.. వెంటనే పట్టుబడిన మొసలి.. వీడియో వైరల్!

Leopard Hunting Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు ట్రెండింగ్ అవుతుంటాయి. ముఖ్యంగా అడవిలో వేటాడే వీడియోలు ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి. అలాంటి ఓ వేటాడే వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మొసలిని చిరుతపులి వేటాడే వీడియోను మీరూ చూసేయండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 03:54 PM IST
Leopard Hunting Video: కసిగా వేటాడిన చిరుతపులి.. వెంటనే పట్టుబడిన మొసలి.. వీడియో వైరల్!

Leopard Hunting Video: అడవిలో నిత్యం జంతువుల మధ్య అనేక ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా జంతువులను వేటాడే సన్నివేశాలు మనల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అడవిలో క్రూర మృగాలైన పులి, సింహం.. చాలా ఓపిగ్గా జంతువులను వెంటాడుతాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ గా మారుతుంటాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రైండ్ గా మారింది. 

ఆ వీడియోలో ఏముంది?

అడవిలో చిరుతపులిని అత్యంత ప్రమాదకరమైన జంతువుగా పరిగణిస్తారు. దీంతో పాటు సింహం కూడా ఇతర జంతువులను వేటాడుతుంది. వేటాడడంలో సింహంతో పోలిస్తే చిరుత పులి చాలా వేగంగా ఉంటుంది. అనేక జంతువులతో పాటు జలచరాలను చిరుత పులి వేటాడగలదు. నీటిలో దిగి ఓ ముసలిని వేటాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదెంటో మీరూ చూసేయండి. 

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో ప్రకారం.. నది ఒడ్డున ఓ చిరుతపులి నడుచుకుంటూ వెళ్తుంది. అంతలోనే కొద్ది దూరంలో ఓ మొసలి ఉన్నట్లు పులి గమనించింది. అలా చిన్నగా నీటిలో ఈదుకుంటూ చిరుత పులి మొసలి దగ్గరకు వెళ్తుంది. పులి రాకను గమనించిన మొసలి.. వెంటనే నీటిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయినా లాభం లేకపోయింది. చివరకు పులికి ఆ మొసలి ఆహారంగా మారింది. నేషనల్ జియోగ్రాఫిక్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 6 కోట్ల 14 లక్షల మందికి పైగా వ్యూస్ లభించాయి.  

Also Read: Thirsty Snake: చేతులతో పాము దాహం తీర్చిన వ్యక్తి - వీడియో వైరల్!

Also Read: Viral Video: ఒక చేతిలో సిగరెట్.. మరో చేతిలో పాము.. ఈ యువతి ధైర్యానికి షాక్ అవ్వాల్సిందే..!

Trending News