Python viral video: సాధారణంగా సామాజిక మాధ్యమాలలో తరచుగా అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో పాములు, కొండ చిలువల వీడియోలు ఇటీవల కాలంలో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటున్నారు. కొందరికి పాముల్ని, కొండ చిలువల్ని తలచుకుంటేనే వెన్నులో వణుకుపుడుతుంది. మరికొందరు మాత్రం వీటితో ఫన్నీగా గేమ్స్ ఆడుకుంటారు. చాలా మంది పాములు, కొండ చిలువలు కన్పిస్తే భయంతో పారిపోతుంటారు.
అయితే.. ఇక్కడ మాత్రం రిస్క్ లో భారీ కొండ చిలువను ఒక వ్యక్తి ప్రాణాలు సైతం తెగించి కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు. ఒక కేనాల్ నీటిలో భారీ కొండ చిలువ చిక్కుకుంది. అది కనీసం ముందుకు వెళ్లలేక విలవిల్లాడిపోయింది. అక్కడ కొంత మంది చూస్తు ఉండిపోయారు.
అందులో ఒక యువకుడు ధైర్యం చేసి కొండ చిలువను ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు. వెంటనే కెనాల్లో దిగి.. వట్టి చేతులతో మెల్లగా కొండ చిలువను పైకి తీశాడు. అక్కడున్న వారంత సదరు వ్యక్తి చేస్తున్న పనిని తమ ఫోన్ లలో రికార్డ్ చేశాడు. అతను ఎంతో చాకచక్యంగా కొండ చిలువను బైటకు తీశాడు.
దీంతో అది సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది. ఈవీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు. మరికొందరు నువ్వు తోపు భయ్యా.. అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.