Monkey Viral Video: సబ్బు పెట్టిమరీ.. బట్టలు ఉతుకుతున్న కోతి! రన్నింగ్ కామెంటరీ వింటే నవ్వాగదు

Viral Video, Monkey washing clothes Using Brush and Soap. దోబి ఘాట్‌లో కూర్చుని మనుషులు ఎలా బట్టలు ఉతుకుతారో.. అచ్చం అలాగే ఉతికేస్తోంది ఓ కోతి.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 4, 2022, 12:58 PM IST
  • సబ్బు పెట్టిమరీ
  • బట్టలు ఉతుకుతున్న కోతి
  • రన్నింగ్ కామెంటరీ వింటే నవ్వాగదు
Monkey Viral Video: సబ్బు పెట్టిమరీ.. బట్టలు ఉతుకుతున్న కోతి! రన్నింగ్ కామెంటరీ వింటే నవ్వాగదు

Monkey Using Brush, Soap and washing clothes just like washerman: కోతి చేష్ట‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇల్లుపీకి పందిరేస్తాయి.. దారిన వెళుతున్న వారి చేతులో ఏమున్నా గుంజుకుంటాయి.. ఇంట్లో చొరబడి మరీ తినుబండారాలను ఎత్తుకెళుతాయి. ఇక వాటికి కోపమొస్తే కరుస్తాయి కూడా. కొన్నిసార్లు కోతి చేసే పనులు చాలా చికాకు తెప్పించినా.. మరికొన్ని సార్లు మాత్రం చాలా సరదాగా అనిపిస్తాయి. తాజాగా కోతి చేసిన ఓ సరదా పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో రన్నింగ్ కామెంటరీ వింటే అస్సలు నవ్వాగదు. 

'ఆడుతూ, పాడుతూ ప‌నిచేస్తుంటే.. అలుపూ, సొలుపూ ఉండ‌డు' అనే పాటను ఆదర్శంగా తీసుకుందో ఏమో ఈ కోతి. దోబి ఘాట్‌లో కూర్చుని మనుషులు ఎలా బట్టలు ఉతుకుతారో.. అచ్చం అలాగే ఉతికేస్తోంది ఓ కోతి. మనుషులు చేసినట్లుగానే ముందుగా బట్టల్ని నీళ్లలో త‌డిపింది. ఆ తర్వాత సబ్బు పెట్టి.. బట్టల బ్రష్‌తో చకచకా ఉతికేసింది. బట్టలు ఉతికే క్రమంలో సదరు కోతి తడిసిపోయింది. ఫుల్లుగా తడిసినా కోతి బట్టలు ఉతుకుతూనే ఉంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🆅🅸🅺🅰🆂 (@ankit_ang_11)

దోబి ఘాట్‌లో కూర్చుని కోతి బట్టలు ఉతుకుతుండగా.. ఎవరో తమ ఫోన్‌లో వీడియో తీశారు. ఆ వీడియోని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అయింది. ఇందుకు సంబందించిన వీడియోను 'ankit_ang_11' అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 

Also Read: మినిమం కామన్ సెన్స్ లేదా.. అక్కినేని అమలను ఆటాడుకుంటున్న నెటిజన్స్!

Also Read: Sreemukhi Photoshoot : శ్రీముఖి.. అందాల చెకుముఖి.. భారీ ఎక్స్‌పోజింగ్‌తో పిచ్చెక్కిస్తోన్న యాంకర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News