Viral Video: పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా నిలబడి హంగామా..

Rajanna sircilla News: ఒక వ్యక్తి పోలీసులకే చుక్కలు చూపించాడు. నగ్నంగా నిలబడి నానా రచ్చ చేశాడు. అంతేకాకుండా పోలీసులను బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 14, 2024, 06:12 PM IST
  • తప్పతాగి పోలీసు స్టేషన్ ముందు రచ్చ..
  • నగ్నంగా నిలబడి బూతులు...
Viral Video: పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా నిలబడి హంగామా..

Drunk Man Naked Infront Of Police Station Goes Viral: కొందరు పోలీసులకు కూడా చుక్కలు చూపిస్తుంటారు. తప్పతాగి ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తుంటారు. నానా రచ్చ చేస్తుంటారు. మనం తరచుగా రోడ్ల మీద కొందరు తాగి న్యూసెన్స్ చేసే వారిని చూస్తుంటాం. రోడ్డుకి ట్రాఫిక్ మధ్యలో అడ్డంగా ఉంటారు. ప్రయాణికులకు ఇబ్బందులు కల్గచేస్తారు. వచ్చి పోయే వారిని బూతులు తిడుతుంటారు. వీరికి ఆపాలని చూసిన వారినికూడా అస్సలు వదలరు. నువ్వేంత అన్నట్లు బూతులతో ఏకీపారేస్తుంటారు. తాగి ఉన్న వారు ఏమాట్లాడుతారో.. ఎలా ప్రవర్తిస్తారో ఎవరు కూడా చెప్పలేదు.

 

కొందరు పోలీసులు తమ డ్యూటీలలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ డ్యూటీలలో ఉంటారు. ఇలాంటి సందర్భాలలో కూడా కొందరు తాగి పోలీసులపైకి దాడులు చేస్తుంటారు. అంతటితో ఆగకుండా.. ఇష్టమున్నట్లు ప్రవర్తించి నానా యాగీ చేస్తుంటారు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..

రాజన్న సిరిసిల్లలోని పోలీసులకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఒక వ్యక్తి తప్పతాగి, పోలీసుస్టేషన్  ముందు నగ్నంగా నిలబడి హంగామా చేశాడు. అంతేకాకుండా.. పోలీసులపైన బూతులు తిడుతూ నానారచ్చ చేశాడు. అతడిని పోలీసులు సముదాయించాలని చూసిన ఏమాత్రం లెక్కచేయడంలేదు. నగ్నంగా నిలబడి, బూతులు తిడుతూ.. స్టేషన్ ముందే న్యూసెన్స్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Read More: Viral News: ఇజ్జత్ తీశావ్ కదారా నాయన.. ప్లేట్ పావ్ భాజీ కోసం దేన్ని చోరీచేశాడో తెలిస్తే షాక్ అవుతారు..

Read More: BackPain: నడుము నొప్పితో బాధపడుతున్నారా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News