Techie Falls Victim To 11 Crore: కంపెనీలో అతడి ప్రతిభను గుర్తించి ఇచ్చిన షేర్లు అనూహ్యంగా భారీగా విలువ పెరిగి కోట్లకు చేరాయి. ఈ సమాచారం తెలుసుకున్న కొందరు ప్రత్యర్థులు.. నిందితులు అతడిని మోసానికి పాల్పడ్డారు. అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడి ఆర్థిక వివరాలు సేకరించారు. అనంతరం ఊహించని స్థాయిలో ఏకంగా రూ11 కోట్లు దోచుకున్నారు. అనంతరం వాస్తవం గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.
Also Read: Donald Trump: తొలి ప్రసంగంతోనే ప్రత్యర్థులకు ఇచ్చి పడేసిన డొనల్డ్ ట్రంప్.. ముఖ్యాంశాలు ఇవే!
బెంగళూరుకు చెందిన విజయ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. గతంలో పని చేసిన కంపెనీలో అతడి సేవలకు మెచ్చి కంపెనీ రూ.50 లక్షల విలువైన షేర్లు కానుకగా ఇచ్చారు. కొన్నాళ్లకు ఆ షేర్ల విలువ కోట్లకు చేరింది. డబుల్.. త్రిబుల్‌గా షేర్ల విలువ పెరగడంతో విజయ్ కుమార్ కోటీశ్వరుడయ్యాడు. మొత్తం షేర్ల విలువ రూ.12 కోట్లకు చేరింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు నిందితులు అతడిని మోసం చేయాలని పక్కా రచించారు.
Also Read: Pending Arears: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. త్వరలో పెండింగ్ ఏరియర్స్ చెల్లింపు
కరణ్, తరుణ్ నథానీ, ధావల్ షా అనే నిందితులు ఒక ముఠాగా ఏర్పడి విజయ్ కుమార్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు, కస్టమ్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల పేరిట ఫోన్లు చేసి విజయ్ కుమార్‌కు ఫోన్లు చేసి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని.. మీరు అరెస్టవుతారని బెదిరించారు. త్వరలో మిమ్మల్ని జైల్లో వేస్తారని హెచ్చరించారు. మనీ లాండరింగ్‌లో మీ ఉండకుండా ఉండాలంటే మీ బ్యాంకు ఖాతాలు క్లియర్‌గా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా ముగ్గురు నిందితులు కొన్ని సూచనలు చేశారు. వారు చెప్పినట్టు వింటూ విజయ్ కుమార్ తన బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలన్నీ చెప్పేశాడు. అనంతరం కొన్ని నెలలుగా విజయ్ ఖాతాల నుంచి నగదును ఆ నిందితులు మొత్తం 11 బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. అలా ఏకంగా ఉన్న రూ.12 కోట్లను దోచేసుకున్నారు. ఈ విషయం గ్రహించిన విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేసి చేధించారు. సంచలనం రేపిన ఈ కేసులో ముగ్గురు నిందితులు కరణ్, తరుణ్ నథానీ, ధావల్ షా అరెస్టయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ధావల్ షా గోల్డ్ బ్రోకర్‌గా.. కరణ్ అంతర్జాతీయంగా నగదు లావాదేవీలు చేస్తుండగా.. తరుణ్ టెక్నాలజీలో దిట్ట. ఇలా వీరు ముగ్గురు కలిసి బృందంగా ఏర్పడి కోట్ల రూపాయల డబ్బులను మోసానికి పాల్పడ్డారు. కాగా ఈ కేసు లింకులు పాకిస్థాన్, చైనాతోపాటు అలాహాబాద్‌కు లింక్‌లు ఉండడం సంచలనం రేపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.