Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రాత్రులు సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది లాగే ఈసారి కూడా ఎండల తీవ్రత అధికం ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు రోడ్లపైకి రావొద్దని అంటున్నారు.
తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇటీవల తెలంగాణ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. తెలంగాణలో రాగల 5 రోజుల్లో ఎండతీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రాగల మూడురోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపారు.
ఇటీవల భాగ్యనగరంలో వర్షం కురిసింది. దీంతో వాతారణం చల్లబడింది. ఎండ తీవ్రత నుంచి నగరవాసులు ఉపసమనం పొందారు. వేడి నుంచి ఉపసమనం పొందేందుకు నగరవాసులు శీతల పానియాలను సేవిస్తున్నారు.
Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై స్పందించని పవన్ కళ్యాణ్.. సినిమా ఇంకా చూడలేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook