Viral Video: వాటర్‌ డ్యామ్‌ వద్ద అపశృతి..పాకుతూ జారిపడ్డ వ్యక్తి..!!

Viral Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా బైక్‌ విన్యాసాలు, ఇతర స్టంట్లకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తమాషా  తమాషా పనులే ఏకంగా ప్రణాల మీదకు వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 08:53 AM IST
  • వైరల్ అవుతున్న విన్యాసాల వీడియోలు
  • డ్యామ్‌పై 30 అడుగుల పైకి ఎక్కిన వ్యక్తి
  • ఇంతలోనే ఈ సంఘటన జరిగింది
Viral Video: వాటర్‌ డ్యామ్‌ వద్ద అపశృతి..పాకుతూ జారిపడ్డ వ్యక్తి..!!

Viral Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా బైక్‌ విన్యాసాలు, ఇతర స్టంట్లకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తమాషా  తమాషా పనులే ఏకంగా ప్రాణాల మీదకు వస్తున్నాయి. అయితే ఇటివలే చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస డ్యామ్‌ వద్ద ఓ తమాషా  స్టంట్‌ ప్రాణాల తీసే పని చేసింది. శ్రీనివాస డ్యామ్‌ సమీపంలో నిత్యం సందడిగా ఉంటుంది. అదే సమయంలో ఓ వ్యక్తి డ్యామ్‌ ఎక్కడానికి ప్రయత్నించారు. ఇంతలోనే అతనికి  చేదు అనుభవం ఎదురైంది. అదేంటో మీరు ఈ వీడియోలో చూడోచ్చు.

 

 చాలా సార్లు కొంతమంది తమాషాగా పనులు చేసి తర్వాత బాధపడతారు. ఈ వీడియోలో కూడా వ్యక్తి అదే పని చేశాడు. డ్యామ్ నుంచి నీరు వేగంగా ప్రవహిస్తోంది. ఇంతలోనే ఆ వ్యక్తి డ్యామ్‌ పై పాకుతూ 30 అడుగుల ఎత్తుకు ఎక్కాడు. అంతలోనే దుర్ఘటన జరిగింది. నీటి ప్రవాహ స్థాయి అధికం కావడంతో  స్టంట్‌ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కిందికి జారి పడ్డాడు. దీంతో సందడిగా ఉన్న ఆ ప్రదేశం ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ప్రవాహం స్థాయి తగ్గడంతోనే ఆ అబ్బాయి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అక్కడే ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళన చెందారు.

నేరుగా గోడపై నుంచి దాదాపు 30 అడుగుల పైకి ఎక్కాడు:

చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస డ్యామ్‌ వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు చూసేందుకు అక్కడికి వస్తున్నారు. అయితే  ఓ యువకుడు ఆనకట్ట నేరుగా గోడపై దాదాపు 30 అడుగుల ఎత్తుకు ఎక్కాడు. దీంతో స్లిప్ అయ్యి పడిపోయాడు. ఆ వ్యక్తి కింద పడిపోతున్న దృశ్యాన్ని ఎవరో మొబైల్ కెమెరాలో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనలో అతను ప్రాణాలు రక్షించుకోగలిగాడు. కానీ బారీగా గాయాలయ్యాయి. అక్కడే ఉండే స్థానికులు యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు యువకుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

Also Read: Amla: ఎండు ఉసిరి, జామలో ఎన్నో ఔషధ గుణాలు..జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి..!!

Also Read: Ginger For Health: మధుమేహాన్ని అదుపులో ఉంచాలనుకుంటున్నారా? మీ రోజువారీ ఆహారంలో అల్లంను చేర్చుకోండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News