Celebrity Firing: వేడుకలు శృతి మించితే ఇలానే జరుగుతుంది. మిత్రుడి వివాహానికి హాజరైన మిత్రుడు..ఆ మిత్రుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. అసలేం జరిగింది, ఈ వీడియో ఎక్కడిది
ఉత్తరాదిన జరిగే పెళ్లిళ్లలో పోలీసుల చోద్యం కారణంగా తరచూ మిస్ ఫైరింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వేడుకల్లో ఫైరింగ్ చేయడాన్ని పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్రా జిల్లా బ్రహ్మనగర్ ప్రాంతమది. ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. వేడుక సందర్భంగా పెళ్లి కొడుకు హుషారుగా ఫైరింగ్ చేశాడు. పొరపాటున ఆ బుల్లెట్ అదే పెళ్లికి హాజరైన మరో మిత్రుడికి తగిలింది., ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా కెమేరాలో రికార్డవడంతో..ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
दूल्हे ने की हर्ष फायरिंग, आर्मी के जवान की हुई मौत। यूपी के @sonbhadrapolice राबर्ट्सगंज का #ViralVideo #earthquake #breastislife #fearwomen #Afghanistan pic.twitter.com/7laX9OUIqD
— RAHUL PANDEY (@BhokaalRahul) June 23, 2022
పెళ్లికొడుకు పేరు మనీష్ మధేషియా. పెళ్లి ఊరేగింపులో భాగంగా ఓ రధంపై ఊరేగుతున్నాడు. చుట్టూ బంధుమిత్రులున్నారు. వేడుకల్లో భాగంగా తుపాకీ తీసి గాల్లో కాల్చాడు. అయితే దురదృష్ఠవశాత్తూ ఓ బుల్లెట్ పెళ్లి కొడుకు మిత్రుడైన బాబూలాల్ యాదవ్ అనే ఆర్మీ జవాన్‌కు తగిలింది. అసలు విషయమేమంటే ఆ తుపాకీ కూడా మృతుడు యాదవ్‌దే కావడం గమనార్హం. పెళ్లికొడుకు, మృతుడు ఇద్దరూ స్నేహితులని సోన్‌భద్ర ఎస్పీ నిర్ధారించారు. ఘటన జరిగిన వెంటనే యాదవ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.
బాధితుడి కుటుంబ సభ్యులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పెళ్లికొడుకుని అరెస్టు చేశారు. తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ ఉన్నా సరే..సెలెబ్రిటీ ఫైరింగ్ పేరుతో బహిరంగ ప్రదేశాలు, జనం ఉన్న ప్రాంతాల్లో, పెళ్లిళ్లలో కాల్పులు జరపడం నేరమే.
Also read: Spooky Viral Video: భయం రేపుతున్న మలేషియా వీడియో, మాయమైన బాలుడు దెయ్యమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.