Woman Goes Topless Mid Air: విమానంలో టాప్ విప్పి అంతా తిరుగుతూ రచ్చరచ్చ చేసిన లేడీ

Woman Goes Topless Mid Air: విమానంలోో ఆ మహిళ అరాచకం చూసి తట్టుకోలేని ప్రయాణికులు కొంతమంది ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్నపిల్లలు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ఈ పిల్లచేష్టలు ఏంటని మండిపడ్డారు. అయినప్పటికీ ఆమె వారిని, వారి మాటలను లెక్కచేయలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2023, 08:06 AM IST
Woman Goes Topless Mid Air: విమానంలో టాప్ విప్పి అంతా తిరుగుతూ రచ్చరచ్చ చేసిన లేడీ

Woman Goes Topless Mid Air: రష్యా గగనతలంపై ఉన్న విమానంలో ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. విమానం మార్గం మధ్యలో ఉండగా సిగరెట్ తాగడానికని టాయిలెట్ వైపు వెళ్లిన ఆమెని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ఆ మహిళ.. తాను పైన ధరించిన టాప్ ని విప్పేసి అందరూ చూస్తుండగానే విమానం అంతటా కలియ తిరిగింది. తోటి ప్రయాణికులు, చిన్నపిల్లలు తన వైపే చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తన ఎదపై ఎలాంటి అచ్చాదన లేకుండానే విమానంలో అటు ఇటు తిరుగుతూ గోలగోల చేసింది. ఒకానొక దశలో తాను ఇప్పటికిప్పుడే పైలట్లని కలవాలని గొడవ చేస్తూ కాక్ పిట్ లోకి దూరే ప్రయత్నం చేసింది. 

ఆ మహిళ అరాచకం చూసి తట్టుకోలేని ప్రయాణికులు కొంతమంది ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్నపిల్లలు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ఈ పిల్లచేష్టలు ఏంటని మండిపడ్డారు. అయినప్పటికీ ఆమె వారిని, వారి మాటలను లెక్కచేయలేదు. మహిళ చేస్తోన్న గోల ఎక్కువవుతుండటంతో విమానంలోని సిబ్బందిలో ఒకరు ఆమెని పట్టుకుని కంట్రోల్ చేశారు. 

రష్యాలోని స్టావ్రోపోల్ నుంచి మాస్కోకి వెళ్తున్న ఏరోఫ్లాట్ ఎయిర్ లైన్స్ విమానంలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో రచ్చరచ్చ చేసిన మహిళను అంజెలిక మాస్క్‌విటినగా గుర్తించారు. ఆమె వయస్సు 49 ఏళ్లు. తాను ఇలా అల్లరి చేసినందుకు తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఆరోపిస్తూ తనని మెంటల్ హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. లేదంటై జైలుకు తీసుకెళ్తారు అంటూ అంజెలిక మాస్క్‌విటిక అరిచి గగ్గోలు పెట్టింది.

విమానం మాస్కో చేరేవరకు ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఆమెని కంట్రోల్లో పెట్టారు. విమానం మాస్కో చేరగానే ఆ ప్రయాణికురాలిని పోలీసులకు అప్పగించినట్టు ఏరోఫ్లాట్ ఎయిర్ లైన్స్ సంస్థ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. విమానంలో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తూ విమానం సిబ్బందిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఏరోఫ్లాట్ ఎయిర్ లైన్స్ సంస్థ అభిప్రాయపడింది. 

ఇది కూాడా చదవండి : Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే

ఇది కూాడా చదవండి : PM Svanidhi Yojana: ఈ లోన్ తీసుకుంటే నయాపైస వడ్డీ లేదు.. గ్యారెంటీ అసలే లేదు..

ఇది కూాడా చదవండి : Small Savings Schemes: బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ వడ్డీ రేట్లే ఎక్కువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News