Anant Chaturdarshi 2022: అనంత చతుర్దశి ఎప్పుడు, గణేష్ నిమజ్జన ముహూర్తం, దీని వెనుకున్న కథ

Anant Chaturdarshi 2022:  అనంత చతుర్దశి నాడు గణేష్ నిమజ్జనం చేస్తారు. అసలు అనంత చతుర్ధశి రోజే ఎందుకు నిమజ్జనం చేస్తారు, శుభ మహూర్తం ఎప్పడు, దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 4, 2022, 09:06 AM IST
Anant Chaturdarshi 2022: అనంత చతుర్దశి ఎప్పుడు, గణేష్ నిమజ్జన ముహూర్తం, దీని వెనుకున్న కథ

Ganesh Visarjan 2022 Date and Time: దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిథి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఇది పది రోజుల పండుగ. ఇప్పటికే ప్రతి ఇంట, వీధి వీధినా  విష్నేుశ్వరుడు కొలువుదీరాడు. వినాయకుడి పుట్టిన రోజు గణేష్ చతుర్థి అంటే... వినాయకుడి నిమజ్జనం రోజును అనంత చతుర్థి అంటారు. ఇది ఎప్పుడు వచ్చింది, దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి రోజున అనంత చతుర్దశి (Anant Chaturdarshi 2022)జరుపుకుంటారు. ఇది ఈ సారి సెప్టెంబరు 9, 2022న వచ్చింది. ఈ రోజునే గణేశుడి నిమజ్జనం చేస్తారు. అయితే ఈ రోజున శ్రీమహావిష్ణువును కూడా పూజించడం అనవాయితీ. గణపతి నిమజ్జనం శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం. 

గణేష్ నిమజ్జన శుభ ముహూర్తం
భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి 08 సెప్టెంబర్ 2022న గురువారం రాత్రి 09:02 గంటలకు ప్రారంభమై... 09 సెప్టెంబర్ 2022, శుక్రవారం సాయంత్రం 06:07కి ముగుస్తుంది.
ఉదయం గణేష్ నిమజ్జన ముహూర్తం - 6.03 నుండి -10:44 వరకు
గణేష్ నిమజ్జన మధ్యాహ్నం ముహూర్తం - 12:18 నుండి 1:52 నిమిషాలు
గణేష్ నిమజ్జన సాయంత్రం ముహూర్తం - సాయంత్రం 5.00 - 6.31 వరకు

గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారు? 
పురాణాల ప్రకారం, మహర్షి వేదవ్యాసుడు ఆదేశానుసారం గణపతి మహాభారతాన్ని సరళమైన భాషలో రాశాడు. అయితే దీనిని రాయడాన్ని గణేష్ చతుర్థి నుండి ప్రారంభించాడు. అలా 10 రోజుల ఆగకుండా రాస్తూనే ఉన్నాడు. అప్పుడు వ్యాసుడు గణేశుడి శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగినట్లు తెలుసుకున్నాడు. దీంతో అతడు గణపతిని నీటిలో స్నానం చేయమని చెప్పాడు. దీంతో అతడి శరీరం చల్లబడింది. అప్పటి నుండి గణపతి విగ్రహాన్ని అనంత చతుర్ధశి నాడు నిమజ్జనం చేస్తారు. 

Also Read: Surya Grah Remedies: జాతకంలో సూర్యుడు బలపడాలంటే... ఆదివారం ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News