Bhogi Pongal 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడు ధనుస్సు రాశిని వదిలి మకరరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో శుభ గడియలు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా పెళ్లికి సంబంధించి మంచి రోజులు కూడా ప్రారంభవుతాయి. అయితే ఈ సంచారం 15 జనవరి జరగనుంది. దీంతో అదే రోజూ మకర సంక్రాంతి జరపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ఈ పండగను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. పంజాబ్‌లో లోహ్రీ గానూ.. గుజరాత్‌లో ఉత్తరాయణంగానూ జరుపుకుంటారు. అయితే తమిళనాడులో పొంగల్‌గా నలుగు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ రోజులు ప్రజలంతా ఎంతో ఆనందంతో పిండి వంటలు తింటారు. పొంగల్‌కి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకోండి.
పొంగల్‌కు 4 రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?:
పొంగల్ పండుగను వరుసగా 4 రోజుల పాటు జరుపుకుంటారు. ఈసారి జనవరి 15 నుంచి 18 వరకు జరుపుకోనున్నారు. పొంగల్ మొదటి రోజును భోగి అని పిలుస్తారు. రెండవ రోజు సూర్య పొంగల్ అని.. మూడవ రోజు మట్టు పొంగల్ అన, చివరి రోజుని కనుమ పొంగల్ అని పిలుస్తారు. ఈ నాలుగు రోజుల్లో సంప్రదాయ బద్దంగా పనులు నిర్వహిస్తారు. అయితే ఈ పండగకు ఇంత ప్రాముఖ్యత రావడానికి ప్రధాన కారణాలు దేశం మొత్తం జరుపుకోవడమేనని శాస్త్రీయ నిపుణులు తెలుపుతున్నారు.
భోగి పొంగల్ ప్రాముఖ్యత:
దక్షిణ భారతదేశంలో పొంగల్ మొదటి రోజును భోగి అంటారు. ఈ రోజు చాలా మంది సూర్యుడితో పాటు, ఇంద్రుడికి కూడా పూజా కార్యక్రమాలు చేస్తారు. అందుకే వివిధ రాష్ట్రాల్లో ఇంద్ర పొంగల్ అని కూడా పిలుస్తారు. పొంగల్ సందర్భంగా ఇంద్రుడిని ఆరాధించడం వల్ల జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభించడానికి తప్పకుండా ఇంద్రుడికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఈ రోజునే తమిళంలో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
భోగి పొంగల్ నాడు ఏం చేస్తారు?:
భోగి పొంగల్ మొదటి రోజున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను శుభ్రం చేసి.. ఇంట్లోని పనికిరాని వస్తువులను భోగి మంటాల్లో వేస్తారు. అంతేకాకుండా ఇంట్లో పనికి రాని వస్తువుల లేకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. మరికొందరైతే ఇంటి ముందు ముగ్గులు పరిచి.. ఇంటి ప్రధాన ద్వారం ముందు మామిడి ఆకులతో చేసిన తోరనాలు కడతారు. అంతేకాకుండా సాయంత్రం అందరూ గుమిగూడి భోగి కొట్టం అనే ప్రత్యేక వాయిద్యం వాయిస్తూ జానపద పాటలు పాడుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇది కూడా చదవండి : Aadhaar Card Important News: మీ ఆధార్ కార్డ్ లాక్ లేదా అన్‌లాక్ చేసుకోండిలా
ఇది కూడా చదవండి : Tata Punch Car Insurance: టాటా పంచ్ కారును ఇన్సూరెన్స్ కోసం ఓనర్ ఏం చేస్తున్నాడో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook