Budh Uday in Mithun Rashi 2023: ప్రస్తుతం గ్రహాల రాకుమారుడు బుధుడు తన సొంత రాశి అయిన మిథునరాశిలో సంచరించనున్నాడు. సంపద, వ్యాపారం మరియు వాక్కుకు కారకుడిగా మెర్క్యూరీని భావిస్తారు. అయితే రీసెంట్ గా బుధుడు మిథునరాశిలో ఉదయించాడు. దీని కారణంగా భద్రరాజయోగం ఏర్పడుతుంది. జెమినిలో బుధుడు ఉదయించడం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం
బుధుడి సంచారం ఈ 3 రాశులకు వరం
కన్య: బుధుడు ఉదయించడం వల్ల కన్యా రాశివారికి చాలా లాభాలు కలుగుతాయి. భద్ర రాజయోగం ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా లాభాలను ఇస్తుంది. మీడియా, రచన లేదా కళ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీకు కొత్త జాబ్ ఆఫర్ లభిస్తుంది. మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది.
సింహ రాశి : భద్ర రాజయోగం సింహ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పెద్ద కంపెనీలో చేరే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. బిజినెస్ లో పెద్ద డీల్ కుదిరే అవకాశం ఉంది. కూడిన పెట్టుబడి మీకు లాభాలను ఇస్తుంది.
Also Read: Shani Vakri 2023: శని తిరోగమనం ఈ 3 రాశులకు వరం.. ఇందులో మీది ఉందా?
ధనుస్సు: బుధగ్రహ సంచారం మరియు ఉదయం వల్ల ఏర్పడిన భద్ర రాజయోగం ధనస్సు రాశివారికి మేలు చేస్తుంది. మీ జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీకు కొత్త వారితో పరిచయాలు పెరుగుతాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.
Also Read: Mars Transit 2023 Effects: ఈ రాశులవారికి 49 రోజుల పాటు కష్టాలు, నష్టాలు తప్పవా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook