Guru Margi 2022: దాదాపు 119 రోజుల తర్వాత బృహస్పతి తాను సంచరించిన గ్రహాన్ని వదిలి ఇతర గ్రహంలోకి సంచరించబోతున్నాడు. ఈ సంచారం ఈరోజే 24 నవంబర్ జరగబోతోంది. చాలా రోజుల తర్వాత బృహస్పతి గ్రహం మీనరాశిలోకి ప్రవేశం చేయడం వల్ల 12 రాశి చక్రాల్లో పలు రకాల మార్పులు రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సంచార ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారు మంచి ప్రయోజనాలు ఇంకొన్ని రాశుల వారికి దుష్ప్రభావాలు కలిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సంచార ప్రభావంతో ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి:
మేష రాశి వారు ఈ సంచార క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందినప్పటికీ.. తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరి భాగస్వామ్య జీవితంలో కొన్ని లోటుపాట్లు వచ్చిన ఏమాత్రం వెనకడుగు వేయకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న ఈ రాశి వారు పదవున్నతులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఆర్థిక విషయాలపై జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.
వృషభ రాశి:
బృహస్పతి సంచారం వల్ల వృషభ రాశి వారికి వృత్తిపరమైన పనుల్లో చాలా లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సంచార క్రమంలో కష్టపడి పని చేస్తే మీరు కోరుకున్న కోరికలు తీరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సంచారం వల్ల ఆర్థికపరమైన లోటు తీరుతుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న వారు ఈ క్రమంలో సులభంగా పొందే అవకాశాలు ఉన్నాయి.
మిధున రాశి:
ఈ సంచార క్రమంలో మిధున రాశి వారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ సంచారం కారణంగా వీరి జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. మిధున రాశి వారు ఈ క్రమంలో ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించిన అవి లాభాల్లో ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. బృహస్పతి సంచారం వల్ల మిధున రాశి వారు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరు వ్యాపారాలపరంగా మంచి లాభాలు పొందుతారు. కాబట్టి వ్యాపారాలు ప్రారంభించుకోవాలనుకుంటే ఇదే మంచి సమయంగా భావించవచ్చు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Bihar Road accident: భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు... 12 మంది దుర్మరణం..
Also Read : Telangana: అయ్యప్ప పూజకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ... ఐదుగురు దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook