Hanuman jayanti 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని పౌర్ణిమ నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటచారు. శ్రీరాముడి భక్తుడిగా, వానర దేవుడిగా హనుమంతుడిని కీర్తిస్తారు. హనుమాన్ జయంతి పురస్కరించుకుని హిందూవులు ఉపవాసం ఉంటారు. హనుమంతుడి ఆలయాల్ని సందర్శిస్తారు. మరీ ముఖ్యంగా సుందర కాండ పాఠం పఠిస్తారు.
హనుమాన్ జయంతి, హనుమాన్ జన్మోత్సవం, ఆంజనేయ జయంతి , భజరంగబలి జయంతి ఇలా పేరేదైనా ఒకటే పండుగ. హనుమంతుడి పుట్టినరోజు వేడుక. హిందూవులకు అత్యంత ప్రాముఖ్యమైంది, మహత్యం కలిగింది. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 6వ తేదీ గురువారం ఉంది. హనుమాన్ జయంతి పూజా వేళలు ఇలా ఉన్నాయి. పౌర్ణిమ తిధి ఏప్రిల్ 5వ ఉదయం 9.19 గంటలకు ప్రారంభమై..ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10.04 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున కొన్ని గంటల సమయం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. అవే శుభ ముహూర్త వేళలుగా పరిగణిస్తారు.
ఉదయం 6.06 గంటల నుంచి 7.40 గంటల వరకూ
ఉదయం 10.49 గంటల నుంచి మద్యాహ్నం 12.23 గంటల వరకూ
మద్యాహ్నం 12.23 గంటల నుంచి 1.58 గంటల వరకూ
మద్యాహ్నం 1.58 గంటల నుంచి 3.32 గంటల వరకూ
సాయంత్రం 5.07 గంటల నుంచి 6.41 గంటల వరకూ
సాయంత్రం 6.41 గంటల నుంచి 8.07 గంటల వరకూ
Also Read: Budh Vakri 2023: బుధుడి తిరోగమనంతో ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీది ఉందా?
హనుమాన్ జయంతి 2023 ప్రాముఖ్యత, చరిత్ర
హనుమంతుడు వానర రాజు కేసరి, తల్లి అంజనికి పుట్టినట్టు పండితులు చెబుతుంటారు. హనుమంతుడిన శివుని అవతారంగా చెబుతారు. శ్రీరాముడికి సేవ చేసేందుకే శివుడు హనుమంతుడి అవతారంలో పుట్టారంటారు. హనుమంతుడికి భజరంగబలి, సుందర్, మారుతి నందన్, పవన పుత్ర, అంజనీ నందన్, సంకట్ మోచన్ అనే పేర్లున్నాయి. కష్టాలు, ఇబ్బందులు తొలగించి ఆదుకుంటాడనే నమ్మకంతో సంకట మోచనుడిగా పిలుస్తారు. భక్తుల ప్రార్ధనలతో వారికి కావల్సిన విజయాన్ని అందిస్తాడని నమ్మకం.
డ్రిక్ పంచాంగం ప్రకారం హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణిమ నాడు జరుపుకుంటారు. ఉత్తరాదిన చాలా ప్రసిద్ధ పండుగ ఇది. దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి జరుపుకున్నా..వివిద రాష్ట్రాల్లో వేళలు వేర్వేరుగా ఉంటాయి.
Also Read: Covid19 Cases in India: దేశంలో కరోనా కలకలం, 24 గంటల్లో 4వేలకుపైగా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook