Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 18, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Today Rasi Phalalu in Telugu | ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2021, 07:57 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 18, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 18 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 18న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీరేంటో మీకు బాగా తెలుసు. గతంలో చేసిన తప్పులను తెలుసుకుని మీ సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించగలరు. ఆలోచిస్తే ఎక్కడ తప్పు జరిగిందో అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. మరియు వాటిని సరిదిద్దడానికి తప్పుడు విషయాలను మార్చడానికి మీకు సహాయపడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి. నేడు వీరికి వాహనయోగం కలగనుంది. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. 

Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే

వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య విషయాలు సజావుగా జరుగుతాయి. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఒంటరిగా ఉంటే, ప్రేమ అనే విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఖర్చులు అధికం కావడంతో రుణాలు చేస్తారు. సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

మిథున రాశి
గతాన్ని తలుచుకుని బాధ పడతారు. అయితే దానివల్ల మీకు ఊరట కలగదని గ్రహించాలి. కనుక గతంలో జరిగిన పొరపాట్లను విశ్లేషించుకుని, వాటిని పరిష్కరించుకునేందుకు యత్నాలు మొదలుపెడతారు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. నేడు మీకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి.

కర్కాటక రాశి
ఈ రోజు మీలో ఆసక్తిని పెంచే వ్యక్తి మీకు కనిపిస్తారు. అయితే వారికి దూరంగా ఉండకుండా, మీరే మొదటి అడుగు వేయాలని భావిస్తారు. అందువల్ల మీకు మేలు జరగనుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు మీ తలుపు తట్టనున్నాయి. సమస్యలు తొలగిపోతాయి.

సింహ రాశి
పనిలో మీకు అప్పగించిన బాధ్యతల కారణంగా మీకు ఇష్టమైన వారు మరియు కుటుంబం నుండి కొద్దిగా దూరంగా ఉండాల్సి వస్తుంది. మీ పని జీవితాన్ని మరియు మీ వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి మీకు కొంచెం ప్రణాళిక అవసరం. పని కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే చేపట్టిన పనిని మాత్రం మధ్యలోనే వదిలిపెట్టకూడదు.

కన్య రాశి
మీ ప్రేమ జీవితానికి సంబంధించి మీరు మంచి స్థానంలో ఉన్నారు. మీ చుట్టూ ఉండే కొందరు చెడు పనులు చేస్తున్న కారణంగా గందరగోళానికి గురవుతారు. మీ భాగస్వామిని నమ్మండి మరియు అనుమానాస్పదంగా ఉండకండి. మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తారు మరియు మిమ్మల్ని బాధపెట్టే పనులు చేయరని తెలుసుకుంటారు. ఆర్థిక సమస్యల కారణంగా రుణ యత్నాలు మొదలుపెడతారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. 

తులా రాశి
ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాహాది శుభకార్యాలపై చర్చ జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రిస్క్ తీసుకోవటానికి మరియు మీ కంఫర్ట్ జోన్ నుండి వైదొలగడానికి ఇది మంచి రోజు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పనిచేసే చోట ప్రమోషన్లు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆస్తి కలిసొస్తుంది.

వృశ్చిక రాశి
మీ గతంలో తెలిసిన వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి తిరిగి వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. కానీ మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో దాని గురించి ఆలోచించడం మంచిది. అయితే చెడు కన్నా మంచి జరిగే దిశగా ఆలోచనలు సాగాలి. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారులు, ఉద్యోగులకు లాభసాటిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం దైవదర్శనాలు చేయాలని భావిస్తారు.

ధనుస్సు రాశి
మీరు ఈ రోజు పనులలో తీరిక లేకుండా గడుపుతారు. కేవలం మార్పు కోరుకున్నందున మీరు బిజీగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంటారు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి తీవ్రంగా శ్రమిస్తారు. కానీ ఒకేరోజు అన్ని పనులు చేయలేరని తెలుసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పనులు ఆలస్యం అవుతాయి. ఏకాగ్రత కోల్పోవద్దు.

మకర రాశి
మీకు మరియు మీ భాగస్వామికి మధ్య కొన్ని విషయాలలో సమస్యలు తలెత్తవచ్చు. మీరిద్దరూ వేర్వేరు విషయాల కోసం ఎదురు చూస్తున్నారు, సర్దుబాటు చేసుకుంటే మీ సమస్య సగం తగ్గుతుంది. మీకు ఇష్టమైన వారికి సమయం కేటాయిస్తూనే, మీ లక్ష్యాలపై దృష్టి పెడితే మేలు జరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకున్న ఫలితాలు రానున్నాయి. మీ చేతికి కొంత మేర ఆస్తి అందుతుంది.

Also Read: EPFO: ఖాతాదారులు కంపెనీ మారుతున్నారా, ఇకనుంచీ EPF Transfer తలనొప్పి ఉండదు

కుంభ రాశి
ఈ సమయంలో మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను శోధించే ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాలు మీకు అశాస్త్రీయంగా అనిపించవచ్చు. నూతన పరిచయం అయిన వ్యక్తులతో చర్చలు మనస్పర్థలకు దారితీస్తాయి. అవతలి వ్యక్తిపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలహాలు, చికాకులు తప్పవు. అయితే ఆచితూచి వ్యవహరిస్తే కొంతమేర ఉపశమనం కలుగుతుంది.

మీన రాశి
ఈ రోజు మీరు అన్ని విధాలుగా గతంలో చేసిన పనుల ప్రభావాన్ని అనుభవిస్తారు. ఇందులో మంచి, చెడు మిళితమై ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యాయామాలతో మానసిక ప్రశాంతత పొందవచ్చు. మీ మెదడుకు పదును పెడతారు. కొన్ని పనులలో మీకు ఆటంకాలు తప్పవు. అయితే వెనకడుకు వేయకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. దైవదర్శనాలు చేసుకుని మీ మనసులో ఉన్న విషయాలను కోరుకుంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News