Horoscope Today May 14 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... ఇవాళ కొన్ని రాశుల వారికి పూర్తిగా సానుకూల సమయం. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అందరి నమ్మకం చూరగొంటారు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల సమయం వెంటాడుతోంది. తద్వారా పనుల్లో జాప్యం జరగవచ్చు. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..
మేషరాశి ( Aries)
ఫీల్డ్‌లో బాగా పనిచేసినందుకు మీరు బహుమతులు పొందవచ్చు. వ్యాపారులు వ్యాపార సంబంధిత పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలి. వ్యాపారులు ఈరోజు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ఏదైనా రాయాలనే ఆసక్తి, తపన ఉన్న యువతకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఇవాళ మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. ఇంట్లోని చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్న పిల్లలు తమ సమస్యలను చెప్పుకోలేరు, కాబట్టి వారి సంకేతాలను అర్థం చేసుకోండి. మీరు కాలేయ వ్యాధిగ్రస్తులైతే అప్రమత్తంగా ఉండాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ కలత చెందకండి, మీరు ప్రయత్నిస్తే, మీరు విజయం సాధిస్తారు.
వృషభ రాశి (Taurus)
మీ ఆఫీసులో ఉన్నతాధికారులకు మీ పట్ల మంచి నమ్మకం కుదురుతుంది. ఇది మంచి విషయమే కానీ మీరు అతి విశ్వాసానికి దూరంగా ఉండాలి. డెకరేషన్ వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. కష్టాల్లో కూడా నవ్వుతూ ఉండండి. కొన్ని సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. మీరు ప్రేమించే వ్యక్తుల కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించండి. వారి పట్ల శ్రద్ధ వహించండి. నిద్రలేమి లేనిపోని వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి రాత్రి పూట బాగా నిద్ర పోవాలి. నిశ్శబ్ద ప్రదేశంలో నిద్రించడానికి ప్రయత్నించండి. మీ తెలివితేటలతో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు.
మిథున రాశి (GEMINI)
మిథున రాశివారు సహోద్యోగులు, సహచరుల తీరుతో కాస్త కలవరపడుతారు. అలాగే, టార్గెట్ బేస్ వర్కర్లపై పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు వస్తువుల స్టాక్‌ను నిర్వహిస్తారు. ఏ సమయంలోనైనా మంచి డిమాండ్ రావచ్చు. వివాహ సంబంధాలు చూస్తున్న పిల్లలకు సంబంధం రావచ్చు. తండ్రితో సత్సంబంధాలు కొనసాగించండి. మీ నాన్నకు కూడా అది ఇష్టం. జంక్ ఫుడ్ మీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు ఏదైనా ముఖ్యమైన పని చేపట్టబోయే ముందు హనుమాన్‌ని పూజించాలి.
కర్కాటక రాశి (Cancer)
ముఖ్యమైన పనులు చేపట్టినప్పుడు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి, లేకపోతే చేపట్టిన పని మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. వ్యాపారంలో తొందరపాటు వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఏ పనైనా ఓర్పుతో, ఆలోచనతో చేస్తారు. పరిశోధనలు చేసే వారు విజయం సాధిస్తారు. మీ పరిశోధనలకు పెద్ద సంస్థ నుంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవాలి. ఆస్తమా రోగులు అప్రమత్తంగా ఉండాలి. పగటిపూట మండే వేడి వారికి హానికరం. మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలరు.
సింహ రాశి (LEO)
మీ సహోద్యోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. వారి ప్రతి పనిని అనుమానించడం సరికాదు. క్రమశిక్షణారాహిత్యం వల్ల యువత చేపట్టే పనులకు ఆటంకం కలుగుతుంది. క్రమశిక్షణతో పనిచేసేవారి ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇంట్లో శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పైకప్పులపై సాలీడు గూడ్లు ఉంటే, వాటిని శుభ్రం చేయండి. ప్రతి మూలను శుభ్రపరచండి. చెత్త సేకరించినట్లయితే, దాన్ని తొలగించండి. కంటి రక్షణ చాలా ముఖ్యం. ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు ఎక్కువగా వాడటం మానుకోవాలి. కొంత సమయం పనిచేసిన తర్వాత కళ్లకు విశ్రాంతి ఇవ్వండి. ఇతరులకు సమయం ఇవ్వడం కంటే మీ కోసం కాస్త సమయం వెచ్చించండి.
కన్య రాశి (Virgo)
కన్యా రాశి వ్యక్తుల పనితీరుపై ఉన్నతాధికారులు ఆరా తీయవచ్చు. మీ పని మీరు చేస్తూ ముందుకు సాగండి. వ్యాపారంలో భాగస్వామితో డబ్బు విషయంలో పారదర్శకత ఉండాలి. పాత పెట్టుబడులపై ఒక కన్నేసి ఉంచాలి. ఈ రోజు యువత మానసికంగా మరియు శారీరకంగా చురుకుగా కనిపిస్తారు, మీ పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రియమైన వారి ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెడుతుంది. శరీరంలో తరచుగా నొప్పి లేదా అలసట ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోండి. అందరి అంచనాలను అందుకోవడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి.
తులా రాశి (Libra)
మీరు శుభవార్త అందుకోబోతున్నారు. నిలిచిపోయిన ప్రమోషన్‌ను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో సీనియర్ వ్యక్తుల మార్గదర్శకత్వం అందుకుంటారు. వ్యాపారం ప్రారంభ దశలో చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటుంది. ఆచీ తూచీ ఖర్చు పెట్టాలి. యువత పరీక్షల్లో బాగా రాణిస్తారు. ఇంట్లో వివాదాలు పెరగనివ్వవద్దు. అవి కుటుంబ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మారుస్తాయి. చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. జబ్బులకు మందులు తీసుకునేవారు వేళకు మందులు వేసుకోవాలి. అవసరమైతే మొబైల్‌లో రిమైండర్ పెట్టుకోండి. ఇంటికి ఇవాళ అనుకోని అతిథులు రావొచ్చు. అతిథుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio)
బాస్‌తో మీ సాన్నిహిత్యం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. బాస్‌తో ఎప్పుడూ సమన్వయం ఉండాలి. వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సమయం ఆసన్నమైంది. యువత తమ తెలివితేటలను మరింత పదును పెట్టుకోవాలి. కానీ ఎవరికీ హాని తలపెట్టకూడదు. ఇంట్లో వివాదాల గురించి మీరు కలత చెందవచ్చు, కలత చెందకుండా, మీరు వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. పొట్ట సంబంధిత వ్యాధుల పట్ల చాలా జాగ్రత్త అవసరం. ఏదైనా పని నిలిచిపోయినట్లయితే, అది పూర్తి చేయడంలో మీకు ప్రభుత్వ స్థాయి నుండి సహకారం లభిస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి, మీరు దాని కోసం కాస్త గట్టిగా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. వ్యాపారంలో సృజనాత్మక పనులకు మంచి సమయం. ఈ దిశగా ప్రయత్నాలు జరగాలి. ఈ రోజు పాత బంధువులు, స్నేహితులను కలవడం ఆనందంగా ఉంటుంది. వారు కూడా దీన్ని ఇష్టపడతారు. తిండి విషయంలో నిర్లక్ష్యం వల్ల బరువు పెరుగుతారు. బరువు పెరగడం అనేక వ్యాధులకు మార్గం సుగమం చేస్తుందని గ్రహించాలి. మనసుకు ప్రశాంతత లేకపోతే మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు, ఆత్మీయులతో మనస్సు విప్పి మాట్లాడండి.
మకర రాశి (Capricorn)
వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారం చేయాలి. పెద్ద స్టాక్‌లను తెలివిగా డంప్ చేయండి. బయటికి రాకపోతే డబ్బులు కట్టేస్తారు. యువత ఇంటలెక్చువల్‌ను కలుసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాలను ఎప్పటికీ వదులుకోకూడదు. ఎందుకంటే పండితుల సాంగత్యం ఏ సందర్భంలోనైనా కలిసొస్తుంది. కుటుంబంలో అదరూ కలిసి ఒకే సమయంలో భోజనం చేసే సాంప్రదాయం ఏర్పడాలి. మీరు అనుకోకుండా చేసే పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి, కాబట్టి చిన్నదైనా పెద్దదైనా ప్రతి పనిని ఆలోచనాత్మకంగా చేయండి.
కుంభ రాశి (Aquarius)
ఉద్యోగ పరంగా కొత్త పనుల బాధ్యతలు అప్పగించబడుతాయి. ఇక్కడ మీ సామర్థ్యాన్ని చూపించండి. వైద్య రంగంలో ఉన్న వ్యాపారులకు లాభాలు వస్తాయి. యువకులు తమ అన్నయ్యతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. పక్కనే కూర్చుని అన్నతో చనువుగా మాట్లాడాలి. చిన్ననాటి కొన్ని పాత విషయాలను చర్చించుకుంటే సంతోషం దరిచేరుతుంది. సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కాసేపు గడపాలి. బీపీ రోగులు అప్రమత్తంగా ఉండాలి. బీపీ పెరిగినా, తగ్గినా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు చేసిన పనికి మనస్సులో పశ్చాత్తాపం ఉండవచ్చు, దాని కారణంగా మనస్సు కలత చెందుతుంది. అటువంటప్పుడు ధ్యానం చేయడం చాలా సరైనది.
మీన రాశి (Pisces)
ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి సానుకూల సమయం. వ్యాపారస్తుల ప్రతిష్ట పెరుగుతుంది. యువత మానసికంగా చాలా చురుకుగా ఉండాలి. మానసిక కార్యకలాపాలు మాత్రమే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు సహాయపడతాయి. మీ ప్రియమైన వారి నుండి మీరు కోరుకున్న బహుమతిని పొందవచ్చు. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. ఎక్కువ పని చేసే బదులు కాస్త విశ్రాంతి తీసుకోండి. అజ్ఞాతంలో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి.
Also Read: Delhi Fire Accident Tragedy: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 26కి చేరిన మృతుల సంఖ్య.. 12 మందికి గాయాలు
Also read : Bomb at Pune Railway Station: పుణె రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పద వస్తువు.. రైళ్లు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook