Jupiter Transit Effects On Zodiac Signs: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది మార్చి 31న బృహస్పతి మీనరాశిలో అస్తమించి ఏప్రిల్ 22న మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. మళ్లీ మేషరాశిలో ఏప్రిల్ 30న ఉదయిస్తుంది. ఆస్ట్రాలజీలో బృహస్పతి అస్తమించడం అశుభకరంగా భావిస్తారు. గురుడు సెట్ సమయంలో శుభకార్యాలు వంటివి చేయరు. బృహస్పతి అస్తమించడం వల్ల కొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోంటారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మిధునరాశి
మీనరాశిలో కుజుడు అస్తమించడం వల్ల మిథున రాశిని అనేక సమస్యలు చుట్టుముడతాయి. వ్యాపారాలు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితంలో గొడవలు తలెత్తుతాయి. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు కూడా ఈ సమయం అంతగా కలిసిరాదు.
ధనుస్సు రాశి
మీనరాశిలో బృహస్పతి అస్తమించడం వల్ల ధనుస్సు రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి మీరు హెల్త్ పై శ్రద్ధ తీసుకోవాలి. మీరు ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉన్నట్లయితే ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోంటారు.
కన్య రాశి
కన్యారాశి వారు దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి. మీరు లైఫ్ లో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కోవల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో ఈ సమయం అంతగా కలిసిరాదు.
కుంభ రాశి
ఈ సమయంలో మీరు మీ మాటలను అదుపులో పెట్టుకోవాలి. మీ బంధువులతో విభేదాలు రావచ్చు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. వ్యాపారులు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మీనరాశి
బృహస్పతి ఇదే రాశిలో అస్తమించబోతున్నాడు. దీని కారణంగా మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవల్సి రావచ్చు. మీకు పనిలో అడ్డంకులు ఎదురువుతాయి. కుటుంబంతో తక్కువ సమయం గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.
Also Read: Trigrahi Yog 2023: మీన రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశులపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook