Friday Puja Tips: సంపదకు దేవత లక్ష్మీదేవి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ దేవత అనుగ్రహం ఉంటే మీకున్న డబ్బు కష్టాలు తొలగిపోతాయి. మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. లక్ష్మీదేవి (Goddess Lakshmi) దయ ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి శుక్రవారం చాలా మంచిది. ఈ రోజున ఈ పరిహారాలు చేయడం ద్వారా ఆ తల్లి అనుగ్రహం పొందవచ్చు.
శుక్రవారం పరిహారాలు
>> శుక్రవారం రోజున తెల్లవారుజామున స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీ మంత్రాన్ని పఠించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
>> మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే, దానిని పొందడానికి శుక్రవారం ప్రత్యేక పరిహారం చేయండి. ఈ రోజు నల్ల చీమలకు పంచదార తినిపించండి. ఇలా చేయడం వల్ల చిక్కుకున్న డబ్బు త్వరలో మీకు అందుతుంది.
>> శుక్రవారం రాత్రి 7 గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టండి. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు ఈ గవ్వలను ఉంచండి. అప్పుడు ఎర్రటి గుడ్డలో కట్టిన గవ్వల మూటను డబ్బు ఉన్న స్థలంలో ఉంచండి. కొన్ని రోజుల్లోనే మీ డబ్బు రెట్టింపు అవుతుంది.
>> శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి తామరపువ్వు సమర్పించండి. అంతేకాకుండా శ్రీ సుక్తాన్ని పఠించండి. వీలైతే పాలతో చేసిన స్వీట్లను తల్లి ముందు పెట్టండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.
>> మీ ఇంట్లో ఆనందం, ప్రశాంతత ఉండాలనుకుంటే శుక్రవారం పేదలకు దానం చేయండి. దీంతో మీ ఇల్లు ఎల్లప్పుడూ సంపదతో నిండి ఉంటుంది.
>> శుక్రవారం ఉదయం స్నానం చేసి ఇంట్లో గంగాజలం చల్లాలి. అదే సమయంలో ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి బయట దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మరియు మంచి ఆరోగ్యం లభిస్తుంది.
Also Read: Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ చిన్న చిన్న తప్పులు చేస్తే.. శివుడి ఆగ్రహానికి గురవుతారు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook