Rahu Planet: రాహువు ఎప్పుడూ ఈ 2 రాశులవారిని ఇబ్బంది పెట్టడు.. ఇందులో మీరున్నారా?

Luck Zodiac Signs: సాధారణంగా రాహువు ఎప్పుడు చెడు ఫలితాలనే ఇస్తాడు నమ్ముతారు. అయితే ఆస్ట్రాలజీ ప్రకారం, రాహువు రెండు రాశులవారికి ఎల్లప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాడు. ఆ రాశులు ఏవో మీకు తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ స్టోరీ పై లుక్కేయండి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2023, 07:39 AM IST
Rahu Planet: రాహువు ఎప్పుడూ ఈ 2 రాశులవారిని ఇబ్బంది పెట్టడు.. ఇందులో మీరున్నారా?

Rahu favorite Zodiac Signs: ఆస్ట్రాలజీలో రాహువును ఛాయా గ్రహం, దుష్ట గ్రహమని పిలుస్తారు. రాహువు ఎప్పుడూ చెడు ఫలితాలనే ఇస్తుంది. వ్యక్తి జాతకంలో రాహువు అశుభ స్థానంలో ఉంటే వారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ముఖ్యంగా వారు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. రాహువు ప్రభావం వల్ల మీ దాంపత్య జీవితంతోపాటు బంధుత్వాలలో కూడా చీలికలు వస్తాయి. మెుత్తానికి మీ జీవితం ఒడిదుడుకులకు లోనవుతుంది. 

కుండలిలో రాహువు శుభ స్థానంలో ఉన్నట్లయితే వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఆ వ్యక్తులకు డబ్బుకు లోటు ఉండదు. కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అంతేకాకుండా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వీరు అనుకున్నది సాధించేవరకు నిద్రపోరు. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. అయితే రాహువు ఎల్లప్పుడూ తన అనుగ్రహాన్ని రెండు రాశులవారిపై కురిపిస్తాడు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

వృశ్చిక రాశి
రాహువుకు ఇష్టమైన రాశులలో వృశ్చికం ఒకటి. ఈ రాశి వారిని ఎప్పుడూ రాహువు ఇబ్బంది పెట్టడు. వృశ్చిక రాశి వారి ఎల్లప్పుడూ శుభఫలితాలనే పొందుతారు. వీరికి ఆకస్మిక ధనలాభం, వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. డబ్బుకు లోటు ఉండదు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

Also Read: Chandra Grahan 2023: అశ్వినీ నక్షత్రంలో ఏర్పడబోతున్న చంద్రగ్రహణం.. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి...

సింహరాశి 
రాహువు ఫేవరెట్ రాశులలో సింహ రాశి కూడా ఒకటి. దీంతో వీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కెరీర్ లో వచ్చే అడ్డంకులన్నింటినీ రాహువు తొలగిస్తాడు.  ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. 

Also Read: Guru Gochar 2023: వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు మేషరాశిలోనే గురుడు.. ఈ 5 రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News