Mercury Retrograde 2023: జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కో లా పిలుస్తారు. గ్రహాలకు యువరాజుగా భావించే బుధుడిని వ్యాపారం, బుద్ధి, అభివృద్ధికి కారకుడని అంటారు. అలాంటి బుధగ్రహం వక్రమార్గం కారణంగా కొన్ని రాశులపై వరాల వర్షం కురవనుంది. అంతులేని ధన సంపదలు కలగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
బుధ గ్రహం ఆగస్టు 24 నుంచతి వక్రమార్గంలో ఉన్నాడు. సెప్టెంబర్ 15 వరకూ ఇదే దిశలో కొనసాగనున్నాడు. ఈ క్రమంలో రానున్న 17 రోజులు ఈ మూడు రాశులకు అత్యద్బుతంగా ఉండనుంది. అంతులేని ధన సంపదలు కలగనున్నాయి. కెరీర్ పరంగా వ్యాపారం విషయంలో చాలా లాభదాయకమైన సమయం. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆదాయం బాగుండటంతో ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.
బుదుడి వక్రమార్గం కారణంగా కర్కాటక రాశి జాతకులు కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయనున్నారు. జీవితం సౌకర్యవంతంగా, లగ్జరీగా ఉంటుంది. కొత్త ఆస్థులు, వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ఊహించని విధంగా కనకవర్షం కురుస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది . వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.
ఇక బుధుడి తిరోగమనం ప్రభావం తులా రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఈ జాతకుల కోర్కెలన్నీ నెరవేరుతాయి. జీవితమంతా సంతోషంగా ఉంటారు. కొత్త పెట్టుబడులకు అత్యంత అనువైన సమయం. పెద్ద పెద్ద ఆర్డర్లు చేతికి అందుతాయి. ఫలితంగా వ్యాపారం విస్తృతమౌతుంది. గౌరవ-మర్యాదలు లభిస్తాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.
బుధుడి తిరోగమనం ప్రభావం వృషభ రాశి జాతకులపై చాలా బాగుంటుంది. ఉద్యోగం మారేందుకు మంచి సమయం. కెరీర్ పరంగా అభివృద్ధి ఉంటుంది. గౌరవ మర్యాదలు లబిస్తాయి. అంతులేని ధన సంపదలు పొందుతారు. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. బుధుడు ధనానికి కారకుడు కావడంతో ఈ రాశి వారికి ధనానికి లోటుండదు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు.
Also read: Saturn Retrograde 2023: బలోపేతమైన శని, ఇవాళ్టి నుంచి ఆ 3 రాశులకు లెక్కలేనంత డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook