ప్రతి నెలా ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులకు అత్యంత శుభంగా మరికొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. డిసెంబర్ ప్రారంభంలో బుధ గోచారం జరిగింది. ఆ వివరాలు మీ కోసం..
డిసెంబర్ నెల ప్రారంభంలో ధనస్సు రాశిలో ప్రవేశించిన బుధుడు డిసెంబర్ 27 వరకూ ఇదే రాశిలో విరాజిల్లనున్నాడు. డిసెంబర్ 16న సూర్యుడు కూడా ఇదే రాశిలో ప్రవేశించనున్నాడు. దీనివల్ల ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడి గురువు రాశిలో ప్రవేశించడం వల్ల శుభప్రదంగా ఉండదు. ఈ పరిస్థితుల్లో చాలా రాశుల జాతకులకు ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది. బుధుడి ధనస్సు రాశిలో ప్రవేశం వల్ల ఏ ప్రభావం పడనుందో తెలుసుకుందాం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడి రాశి పరివర్తనంతో కొన్ని రాశులకు అంతా శుభంగా ఉంటే..మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. ఈ సందర్భంగా కర్కాటక, వృశ్చిక, కన్యా, మీన రాశులకు ఈ సమయం చాలా బాగుంటుంది. అటు తులా, మకర, కుంభ రాశులవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా..మేష, వృషభం, మిథునం, సింహం, ధనస్సు రాశి జాతకులకు ఈ సమయం సాధారణంగానే ఉంటుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధ గోచారం కారణంగా జర్నలిస్టులు, విద్య, రచయితలు,న్యాయవాద వృత్తులవారికి అభివృద్ధి జరుగుతుంది. ఈ రంగాలకు సంబంధించినవారి జీవితంలో కీలకమార్పులు రావచ్చు. గురురాశిలో ఉండటం వల్ల బుద్ధి, జ్ఞానం పెరుగుతుంది.
బుధుడి రాశి పరివర్తనం కారణంగా కర్కాటకం, వృశ్చికం, కన్యా, మీన రాశి జాతకులకు విశేషమైన లాభం కలగనుంది. ఈ జాతకం వారికి ఉద్యోగం వ్యాపారంలో ముందుకెళ్లేందుకు వీలవుతుంది. ఈ సమయంలో నిలిచిపోయిన డబ్బులు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తే అంతా సానుకూలంగా ఉంటుంది.
ఈ కాలంలో మకరం, తుల, కుంభ రాశి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సందర్భంగా ఆర్ధిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. బుధ గోచారం కారణంగా సేవింగ్స్ , పెట్టుబడుల్లో నష్టం కలుగుతుంది. ఈ సందర్భంగా వ్యాపారం కాస్త ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ అదృష్టం మీకు తోడివ్వదు.
Also read: Vijaya Ekadashi 2022: డిసెంబర్ 19 విజయ ఏకాదశి నుంచి ఆ 4 రాశులకు ఊహించని, అంతులేని డబ్బులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook