జ్యోతిష్యం ప్రకారం బుధ గ్రహ గోచారం ఫిబ్రవరి 27వ తేదీ అంటే నిన్న జరిగింది. బుధుడు కుంభరాశిలో ప్రవేశిస్తూనే అప్పటికే ఆ రాశిలో ఉన్న సూర్యుడితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పరిచాడు. దీని ప్రభావం కొన్ని రాశులపై అత్యంత శుభసూచకంగా ఉండనుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎప్పటికప్పుడు గోచారం చేస్తూ రాశి పరివర్తనం చెందుతుంటాయి. ఇతర గ్రహాలతో కలిసి యుతి ఏర్పడటం, శుభ-అశుభ రాజయోగాలు ఏర్పడటం సర్వ సాధారణం. బుధుడు నిన్న అంటే ఫిబ్రవరి 27వ తేదీన శనిరాశిగా భావించే కుంభరశిలో ప్రవేశించాడు. ఆ రాశిలో అప్పటికే సూర్యుడు ఉండటంతో రెండూ కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పరిచాయి. శని రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడటం కొన్ని రాశులకు అత్యంత లాభదాయకంగా ఉండనుంది. మార్చ్ 15 వరకూ ఈ యుతి కొనసాగుతుంది. బుధ గోచారంతో కలిగే ఆ లాభాలేంటో పరిశీలిద్దాం..
బుధుడి రాశి పరివర్తనం 2023 ప్రభావం ఎలా ఉండనుంది
మేషరాశి జాతకులకు బుధ గోచారంతో ఏర్పడిన బుధాదిత్య రాజయోగం ఉద్యోగాలు, పదోన్నతులు కల్పిస్తుంది. ప్రతి రంగంలో విజయం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు లాభాల్నిస్తాయి. ఆదాయం పెరగడం వల్ల ఆర్ధిక ఇబ్బందులుండవు.
వృషభరాశి జాతకులకు బుధుడి గోచారం ప్రభావంతో మార్చ్ 15 వరకూ అంటే మరో 15 రోజులు వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరం లేదు. అద్భుతమైన లాభాలు అందుతాయి. వ్యాపారం, ఉద్యోగంలో లాభాలు కన్పిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేయాల్సిన పనులు సులభంగా పూర్తవుతాయి.ఆదాయం పెరగడమే కాకుండా కీలకమైనది సాధించవచ్చు.
మిధురాశి జాతకులకు బుధాదిత్య రాజయోగంతో అదృష్టం తోడై నిలుస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి ఖాయం. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటంతో చాలా వరకూ సమస్యలు దూరమౌతాయి. వ్యాపారం కోసం ఈ సమయం చాలా అనుకూలమైంది. అందుకే ఈ పదిహేను రోజులు తీసుకునే నిర్ణయాలతో ఆర్ధికంగా లాభపడతారు.
తులారాశి జాతకులకు మార్చ్ 15వ తేదీ వరకూ అత్యంత అనువైన సమయం. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది.
ధనస్సు రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం కారణంగా అమితమైన లాభాలు కలుగుతాయి. కెరీర్‌పరంగా వృద్ధి ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగాలకు అవకాశాలు లభిస్తాయి. మీ పట్ల అందరూ ఆనందంగా ఉంటారు. మీపై ప్రశంసలు కురుస్తాయి.
Also read: Budhatiya Rajyog 2023: బుధాదిత్య రాజయోగం 2023.. ఈ రాశుల వారికి ఎనలేని కీర్తి, ఊహించని డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook