Mercury Transit 2023: జ్యోతిషశాస్త్రంలో బుధుడిని శుభ గ్రహంగా భావిస్తారు. అంతేకాకుండా ఇతడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. జ్ఞానం, అభ్యాసం, తెలివితేటలు మరియు తార్కిక సామర్థానికి బుధుడు కారకుడు. ఫిబ్రవరిలో బుధుడు మకరరాశిలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా అరుదైన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. దీని కారణంగా మూడు రాశులవారు లాభపడనున్నారు.
కేంద్ర త్రికోణ రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
మేషం (Aries): మేష రాశి వారిపై బుధ సంచారం శుభ ప్రభావం చూపుతుంది. ఈ రాశి మార్పు ద్వారా ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం మేష రాశి దశమంలో ఏర్పడుతుంది. దీనివల్ల మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు.
మకరరాశి (Capricorn): ఫిబ్రవరి ప్రారంభంలో బుధుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి గోచారం వల్ల ఏర్పడుతున్న కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల ఈ రాశివారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
తులారాశి (libra): తులరాశి యెుక్క నాల్గో ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. దీని కారణంగా ఏర్పడని కేంద్ర త్రికోణ రాజయోగం తులరాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా వీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఏదైనా వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Rahu Ketu Gochar 2023: 'రాహు-కేతు' గోచారం.. ఈ రాశుల జీవితాల్లో పెను ప్రకంపనలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.