kanuma festival tradition: తెలుగు నాట సంక్రాంతిని పెద్ద పండుగ అని పిలుస్తుంటారు. భోగి, సంక్రాంతి, కనుమలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే.. మనం జనవరి 13, 14, 15 తేదీల్లో ఈ పండుగల్ని జరుపుకోబోతున్నాం. ఈ పండుగలకు ప్రజలంతా ఎక్కడున్న కూడా తమ సొంతూళ్లకు వెళ్లిపోతుంటారు. ఇప్పటికే పట్నం ఖాళీఅయిపోయి.. ప్రజలంతా సొంతూళ్ల బాటపట్టారు. భోగీ రోజున చాలా మంది ఇళ్లలో రేగు పండ్లను తమ పిల్లల మీద వేసుకునే సంప్రదాయం ఉంటుంది.
సంక్రాంతి రోజున ఉదయం నిద్రలేచి.. ఇంటి ముద్దు ఆవుపేడతో అలుకుజల్లి.. ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెళ్లు పెడతారు. అంతేకాకుండా.. ఈ పండుగల్లో భాగంగా చాలా మంది పిండి వంటలు మొదలైనవి ఎక్కువగా చేసుకుంటారు. పండుగకు.. బంధువులు, స్నేహితులతో కలసి సరదాగా గడుపుతుంటారు. గాలి పటాల్ని ఎగర వేస్తుంటారు. అమ్మాయిలు, ముత్తైదువలు ఒకరికి మరోకరు వాయనాలు ఇచ్చుకుంటారు.
ముఖ్యంగా కనుమ రోజున మాత్రం.. చాలా మంది కొన్ని నియామల్ని తప్పకుండా పాటిస్తారు. కనుమ రోజున చెట్టు మీద నుంచి కాకి కూడా కదలదని చెప్తుంటారు. దీని వెనుకాల అనేక కథనాలు ఇప్పటికి ప్రాచుర్యంలో ఉన్నాయి. గతంలో ఎటన్న వెళ్లాలంటే.. ఎడ్ల బండిలే దిక్కు. వాటిని కనుమ రోజు అందంగా అలంకరణ చేసేవారు. దీనితో పాటు.. ఆరోజున పశువులకు ఇష్టమైన మేతను వేసేవారు. ఆ రోజున వాటికి రెస్ట్ ఇచ్చే వారంట. దీంతో కనుమ రోజు పశువులకు ఒక రోజు రెస్ట్ దొరికేందంట. అందుకు కనుమ రోజున ఏ పనికూడా చేసేవారు కారంట.
ప్రయాణాలు అందుకే మానుకునే వారంట. మరో కథ ఏంటంట.. కనుమ రోజున గతించిన మన పూర్వీకులు భూమి మీదకు వస్తారంట. అందుకే చాలా చోట్ల వీరిని గుర్తు చేసుకుంటూ పిండి వంటలు చేసుకుంటారు . దీని వల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. వారికి ఇష్టమైన పిండి పదార్థాలు, మద్యం మొదలైనవి చేసి పెట్టి.. వారి ప్రసాదంగా ఇంట్లో వాళ్లు స్వీకరిస్తారు.
ఇవన్ని , తిని, తాగిన తర్వాత ప్రయాణం చేస్తే.. ఏదైన అలసట వల్ల లేదా మరే కారణంతో అయిన ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉందని అందుకే కనుమ రోజున ప్రయాణాలు చేయోద్దని పండితులు, పెద్దలు అనాదీగా ఆచారంను పాటిస్తు వస్తున్నారు. ఇప్పటికి కూడా కనుమ రోజున అత్యవసరమైతే తప్ప.. ఆ రోజున ఇల్లు దాటేందుకు చాలా మంది ఇళ్లలో పెద్దలు అస్సలు అంగీకరించరు. ( ఇది సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా రాయబడింంది. జీ తెలుగు దీన్ని ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook