Saturn Retrograde 2023: ప్రతి గ్రహం గోచారం చేసినట్టే తిరోగమనం కూడా ఉంటుంది. గ్రహాల కదలికలో మార్పు వస్తే ఆ ప్రభావం వివిధ రాశులపై పడినట్టే కొన్ని రాశులపై మాత్రం ప్రత్యేకం కావచ్చు. అంటే పాజిటివ్ లేదా నెగెటివ్ ప్రభావం కావచ్చు. శని గ్రహం వక్రావస్థలో కదలిక కారణంగా జరగనున్న పరిణామాల గురించి పరిశీలిద్దాం..
హిందూ జ్యోతిష్యం ప్రకారం శని గ్రహాన్ని న్యాయ దేవతగా భావిస్తారు. మనిషి చేసే కర్మల ప్రతిఫలాన్ని ఇచ్చేది శని గ్రహమే. శని గ్రహం కోపంగా ఉంటే ఆ జాతకులకు అన్నీ అవస్థలే. అందుకే శని గ్రహాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక ఉపాయాలు పాటించడం, పూజాది కారక్రమాలు నిర్వహించడం చేస్తుంటారు. హిందూమతంలో శని గ్రహానికి అంతటి ప్రాధాన్యత ఉంది. శని గ్రహం జూన్ 17న కుంభ రాశిలో తిరోగమనమైంది. నవంబర్ 4 వరకూ ఇదే పరిస్థితిలో ఉండనుంది. ఫలితంగా 4 రాశుల జీవితాల్లో ఊహించిన ప్రయోజనం కలగనుంది.
శని గ్రహం తిరోగమనం ప్రభావంతో వృషభ రాశిపై అత్యంత లాభదాయకం కావచ్చు. ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం విస్తృతం కానుంది. ఫలితంగా ఆదాయం పెరగడంతో ఆర్ధికంగా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ఉద్యోగస్థులకు ఆదాయం పెరుగుతుంది. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. పదోన్నతి కచ్చితంగా ఉంటుంది. చేసేపని ఆత్మ విశ్వాసంతో పనిచేయాల్సి ఉంటుంది.
మకర రాశి జాతకుల అధిపతి శని కావడం, ఈ శని గ్రహం తిరోగమనం చెందడం వల్ల మకర రాశి జాతకులపై కీలకమైన ప్రభావం పడనుంది. ఉద్యోగస్థులకు కెరీర్ బాగుంటుంది. పదోన్నతితో పాటు ధనలాభం కలగనుంది. పెండింగులో పడిన పనులు పూర్తవుతాయి. మకర రాశి జాతకులకు కీలక విజయం లభించనుంది. ఆర్ధికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.
శని గ్రహం తిరోగమనం ప్రభావంతో తులా రాశి జాతకులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. ఏకంగా 72 రోజుల పాటు అదృష్టం మెరిసిపోనుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జీవితంలో విలాసవంతంగా ఉంటుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి. ఖరీదైన వస్తువులు అంటే కార్లు, ఇళ్లు కొనుగోలు చేయవచ్చు. ఆర్ధికంగా ఇబ్బందులుండవు. ఇంట్లో పెద్దవారి కుటుంబం మెరుగుపడుతుంది.
Also read: Sun transit 2023: సూర్య గోచారంతో ఈ నాలుగు రాశులకు సెప్టెంబర్ 17 నుంచి అమితమైన లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook