Shani Dev Blessings 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని కీలక గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ గ్రహం చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. అలాగే ఈ గ్రహ సంచారం కారణంగా కూడా శని యొక్క వివిధ దశలు అన్ని రాశుల వారిపై పడుతాయి. ముఖ్యంగా ఇదే సమయంలో ఏలినాటి శని ప్రభావం కూడా పడుతుంది. అయితే ఏ గ్రహమైన ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేయడానికి నెలరోజుల పాటు సమయం పడితే.. ఈ గ్రహం సంచారం చేయడానికి మాత్రం దాదాపు కొన్ని ఏళ్ల సమయం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే శని గ్రహం ప్రస్తుతం కుంభరాశిలో ఉంది. అలాగే ఇటీవల నక్షత్ర సంచారం కూడా చేసింది. ఈ సంచార ప్రభావం నవంబర్ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. దీని కారణంగా నవంబర్ 14వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశుల వారిపై శని ప్రభావం:
తులారాశి:
తులారాశి వారికి శని ప్రభావం కారణంగా నుదిటిరాత మారుతుంది. దీని కారణంగా వీరు ఊహించని ధన లాభాలు పొందుతారు. అలాగే వీరికి కుటుంబంలో శాంతి పెరగడమే కాకుండా.. సంతోషం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ ప్రతిపాదనలు కూడా వస్తాయి. దీని కారణంగా వీరు అద్భుతమైన లాభాలను పొందగలుగుతారు. అలాగే వ్యాపారాలు చేసే వారికి కూడా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఇవే కాకుండా ఇంకా మరెన్నో లాభాలు పొందుతారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కూడా శని గ్రహ సంచారం కారణంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్టం ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో వీరు కెరియర్ జీవితంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈ సమయంలో అద్భుతమైన ప్రమోషన్స్ పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి దాంపత్య జీవితంలో కూడా సంతోషం పెరుగుతుంది. దీని కారణంగా వీరు జీవితంలో ఎప్పుడు పొందలేని ఆనందాన్ని కూడా పొందుతారు. అలాగే కష్టపడి పనులు చేసే వారికి ఎన్నో అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగులు అయితే ఈ సమయంలో సంబరాలు జరుపుకుంటారు.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి కూడా నవంబర్ వరకు అదృష్టం కలిసి వస్తుంది. దీని కారణంగా వీరు జీవితంలో ఎప్పుడూ పొందలేని కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలావరకు మెరుగుపడతాయి. ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా ఈ సమయంలో తిరిగి రావచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.