Sravana Somavaram 2022: శ్రావణ మాసంలోని సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజుల్లో ముఖ్యంగా పరమేశ్వరుడిని (Lord Shiva) ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు భక్తులు. ముఖ్యంగా శివుడి అనుగ్రహాం పొందడానికి ఈ రోజున వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేస్తూంటారు. అదే శ్రావణ సోమవారం రోజు ప్రదోష వ్రతం కూడా వస్తే ఇంక ఏమైనా ఉందా..దాని కంటే శుభదినం మరొకటి లేదని చెప్పాలి. ఇవాళ రెండో శ్రావణ సోమవారం. ఈ రోజే ప్రదోష వ్రతం కూడా వస్తుంది. అంతేకాకుండా ఈ శ్రావణ సోమవారం నాడూ 3 యోగాలు కూడా ఏర్పడతున్నాయి. అవే సర్వార్థి సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం మరియు ధ్రువ యోగం. ఈ యోగాలలో పార్వతీపరమేశ్వరులను పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
శుభ ముహూర్తం 2022
ఈ శ్రావణ రెండో సోమవారం నాడు ఆరాధించడానికి రోజంతా చాలా పవిత్రమైన సమయాలు ఉన్నాయి. ఈ ముహూర్తాల్లో పూజలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి.
అభిజిత్ ముహూర్తం - మధ్యాహ్నం 12:00 నుండి 12:55 వరకు
విజయ ముహూర్తం - మధ్యాహ్నం 02:44 నుండి 03:38 వరకు
సంధ్య ముహూర్తం - సాయంత్రం 07:03 నుండి 07:27 వరకు
అమృత్ కాలం - 03:10 నుండి 04:58 వరకు
సర్వార్థ సిద్ధి యోగం - 25 జూలై 2022 ఉదయం 05:38 నుండి జూలై 26న మధ్యాహ్నం 01:06 వరకు
అమృత సిద్ధి యోగం - 25 జూలై 2022 ఉదయం 05:38 నుండి జూలై 26 మధ్యాహ్నం 01:06 వరకు
పూజా విధానం
శ్రావణ సోమవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. వీలైతే వైట్ డ్రెస్ వేసుకోండి. ఈ రోజు ఉపవాసం ఉంటూ.. పూజ ప్రారంభించండి. ముందుగా ఇంటిని పవిత్ర జలంతో శుద్ధి చేయండి. అనంతరం గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి మొదలైన పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయండి. శివునికి తెల్ల చందనం, అక్షతం, పంచదార, తెల్లని పూలు, గంజాయి, దాతుర, బిల్వపత్రం, స్వీట్లు, పండ్లు మొదలైన వాటిని సమర్పించండి. శివునితో పాటు పార్వతీ దేవిని పూజించడం మర్చిపోవద్దు. ధూపం వేసి..దీపం పెట్టండి. వీలైతే మహామృత్యుంజయ మంత్రాన్ని, శివ చాలీసాను పఠించండి. చివరిగా హారతి ఇచ్చి...అందరికీ ప్రసాదం పంచిపెట్టండి.
Also Read: Mangala Gauri Vrat 2022: ఒకేరోజు శివరాత్రి, మంగళ గౌరీ వ్రతం... శుభముహూర్తం తెలుసుకోండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook