These 3 Zodiac Signs will get Immense fame and unexpected money due to Budhatiya Rajyog 2023: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... గ్రహాల సంచారం ఎప్పటికప్పుడు శుభ మరియు అశుభ యోగాన్ని సృష్టిస్తుంది. గ్రహాల సంచార ప్రభావం మొత్తం 12 రాశుల వారి జీవితంపై ఉంటుంది. ఈరోజు (ఫిబ్రవరి 27) కుంభ రాశిలోకి బుధ గ్రహం ప్రవేశించింది. సూర్యుడు ఇప్పటికే కుంభ రాశిలో ఉన్నాడు. కుంభ రాశిలోకి బుధుడు, సూర్యుడి కలయిక కారణంగా 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతోంది. జ్యోతిషశాస్త్రంలో ఇది చాలా పవిత్రమైన రాజయోగంగా పరిగణించబడుతుంది. బుధాదిత్య రాజయోగం వలన ఈ 3 రాశి రాశుల వారికి గౌరవం, ప్రతిష్ట మరియు సంపద పెరుగుతాయి.
మేష రాశి:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. బుధాదిత్య రాజయోగం మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మేష రాశి చక్రంలోని 11వ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆదాయం భారీగా పెరగనుంది. కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకోవచ్చు. ఆర్థిక పరిస్థితిలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. బుధ సంచారం మరియు సూర్యుని కలయిక వలన ఉద్యోగస్తులకు జీతం పెరుగును. వ్యాపారులు కూడా లాభపడతారు.
తులా రాశి:
కుంభ రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల తులా రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ రాశిలోని ఐదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఈ సమయం కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయం సాధించవచ్చు. సంతానం పొందాలనుకునే వారు కూడా ఈ కాలంలో శుభవార్తలను అందుకుంటారు. సమాజంలో ఎనలేని కీర్తి అందుతుంది.
మిథున రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధాదిత్య రాజయోగం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారి సంచార జాతకంలో తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం జరగబోతోంది. ఈ కాలంలో మీరు అదృష్టం పొందుతారు. అన్ని కోరికలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాన్ని కొనసాగించడానికి ఇది మంచి సమయం. ఈ కాలంలో మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని-వ్యాపారానికి సంబంధించి ప్రయాణం చేయవచ్చు. ఊహించని డబ్బు వస్తుంది.
Also Read: Surya Grahan 2023: 2023లో మొదటి సూర్య గ్రహణం.. భారతదేశంపై ప్రభావం చూపుతుందా? పూర్తి వివరాలు ఇవే
Also Read: Samantha Shaakuntalam : బిచ్చగాడుతో సమంత పోటీ.. చివరి క్షణం వరకు మార్పులు జరిగేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.