Tirumala: వేసవికి కుటుంబంతో తిరుమల వెళ్తున్నారా..? వచ్చే నాలుగు నెలలు ఇవే ప్రత్యేక సేవలు

Tirumala Summer: విద్యా సంస్థల సెలవులతో పిల్లలు కుటుంబంతో కలిసి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలను సందర్శిస్తుంటారు. వేసవి నేపథ్యంలో తిరుమలను సందర్శించాలనుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 2, 2024, 07:03 PM IST
Tirumala: వేసవికి కుటుంబంతో తిరుమల వెళ్తున్నారా..? వచ్చే నాలుగు నెలలు ఇవే ప్రత్యేక సేవలు

Tirumala News: వచ్చే మూడు, నాలుగు నెలలు తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడనుంది. పిల్లలకు సెలవులు వస్తుండడంతో కుటుంబసమేతంగా తిరుమలను సందర్శించుకునేందుకు భక్తులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌, జూలైలో తిరుమల రావాల్సిన భక్తులు కొన్ని జాగ్రత్తలు, విశేషాలు తెలుసుకోవాల్సి ఉంది. వేసవి నేపథ్యంలో టీటీపీ పాలనాధికారి (ఈవో) ధర్మారెడ్డి ఫోన్‌ ఇన్‌ నిర్వహించారు. వేసవి సెలవుల ఏర్పాట్లపై వివరణ ఇచ్చారు. తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలను వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వసతి, లడ్డూ, క్యూలైన్లు, దర్శనం ఏర్పాట్లు వంటి వాటిపై ఈవో ధర్మారెడ్డి వివరించారు.

Also Read: Mother Call Saved: కనిపించే దైవం అమ్మ ఇదిగో సాక్ష్యం.. తల్లి 'ఫోన్‌'తో కుమారుడికి పునర్జన్మ

వేసవి నేపథ్యంలో వీఐపీలకు కాకుండా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీఐపీ బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలలో దాదాపు 7,500 గదులు ఉన్నాయని, వాటిలో 45 వేల మందికి సరిపడా వసతి సౌకర్యం ఉంటుందని చెప్పారు. 85 శాతం గదులు సామాన్య భక్తులకే కేటాయిస్తామని ప్రకటించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండి వసతి చాలకపోతే భక్తులు తిరుపతిలో వసతి పొందే సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా డయల్ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానం ఇచ్చారు. భక్తులు సమస్యలను ప్రస్తావించారు.

Also Read: Yadadri: యాదాద్రి ఆలయానికి రూ.కోట్ల విలువైన 'భవనం' విరాళం.. దంపతుల ఔదార్యం

ఓ భక్తుడు లడ్డూ ధర, పరిమాణం విషయమై ప్రశ్నించగా.. ఈవో 'లడ్డూ పరిమాణం, బరువు తగ్గలేదు. ఇక లడ్డూ ధర తగ్గించడానికి వీల్లేదు' అని స్పష్టం చేశారు. టికెట్ల బుకింగ్‌ విధానంపై వస్తున్న విమర్శలకు బదులిచ్చారు. 'అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఆర్జిత సేవలు, రూ.300 ఎస్‌ఈడీ టికెట్లను అత్యంత పారదర్శకంగా అందిస్తున్నాం. భక్తుల నుంచి అధిక డిమాండ్‌ ఉంటుండడంతో టికెట్లు త్వరగా అయిపోతున్నాయి. టికెట్ల బుకింగ్‌ను క్లౌడ్‌లో ఉంచుతున్నాం' అని వివరించారు.

గదుల్లో గీజర్లు పని చేయకపోవడం తమ దృష్టికి వచ్చిందని.. త్వరలోనే కొత్త గీజర్లు పెట్టి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. వాటన్నిటికి సావధానంగా ఈవో ధర్మారెడ్డి సమాధానం ఇచ్చారు. టికెట్లు, వసతి, సౌకర్యాలు వంటి వాటిపై ఓపికగా బదులిచ్చారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకుని త్వరలోనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భక్తులకు చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News