Vastu Tips: తాబేలు విగ్రహం మీ ఇంట్లో ఉందా.. అయితే మీ ఇంట డబ్బే డబ్బు! ఏ దిశలో ఉంచాలో తెలుసుకోండి

Vastu Tips : వాస్తు ప్రకారం, ఇంట్లో తాబేలు విగ్రహం ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అయితే దీనిని ఏ దిశలో ఉంచడం వల్ల ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 02:49 PM IST
Vastu Tips: తాబేలు విగ్రహం మీ ఇంట్లో ఉందా.. అయితే మీ ఇంట డబ్బే డబ్బు! ఏ దిశలో ఉంచాలో తెలుసుకోండి

Vastu Tips For Turtle Showpiece: ఇంటికి సంబంధించిన ఎన్నో విషయాలు వాస్తు శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఏ వస్తువులు ఇంట్లో ఉంటే నెగిటివిటీ తొలగిపోయి పాజిటివిటీ వస్తుందనే విషయాలు వాస్తులో చెప్పబడ్డాయి. ఇంటిలో తాబేలు విగ్రహం (Tortoise idol) ఉంటే చాలా మంచిది అంటారు. హిందూ పురాణాల ప్రకారం, తాబేలు విష్ణువుకు సంబంధించినది. దీనిని ఇంట్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఏ దిశలో ఉంచాలో తెలుసుకోండి.  

తాబేలు విగ్రహాన్ని ఏ దిక్కున ఉంచాలి?
మీరు మార్కెట్లో అనేక రకాల విగ్రహాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో పాజిటివిటీ కోసం తాబేలు విగ్రహం ఉంచితే మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఈ తాబేలు విగ్రహాలను మెటల్, మట్టి, కలప మొదలైన వాటితో తయారు చేస్తారు. ఒక్కో దానికి ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అయితే వీటిని ఉంచే దిశ కూడా భిన్నంగా ఉంటుంది. 

మెటల్ తాబేలు
మెటల్ తాబేలు విగ్రహాన్ని వాయువ్య దిశలో ఉంచడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. పిల్లల గదిలో ఈ దిశలో తాబేలు ఉంచడం వల్ల వారి తెలివితేటలు పెరుగుతాయి. ఉత్తర దిశలో ఉంచితే జీవితంలో అదృష్టం మరియు పిల్లలలో ఏకాగ్రత పెరుగుతుంది. 

చెక్క తాబేలు
ఇంటి తూర్పు లేదా ఆగ్నేయ దిశలో చెక్క తాబేలు ఉంచండి. దీంతో ఇంట్లో ఉండే ప్రతికూలత తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.

ఆడ తాబేలు
ఆడ తాబేలును ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని వల్ల ఇంట్లోని గొడవలు, మనస్పర్థలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది.

మంచి రోజు
బుధవారం, గురువారం మరియు శుక్రవారాల్లో తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెడితే అపారమైన ప్రయోజనాలు ఉంటాయి. 

Also Read: Sravanam 2022: శ్రావణ మాసం మొదటి ప్రదోష వ్రతం ఎప్పుడు? ముహూర్తం, పూజ విధానం, ప్రాముఖ్యత

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News